ఒకే సీజన్ లో హీరోయిన్స్ గా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటించి ప్రస్తుతం సీనియర్స్ లిస్ట్ లోకెళ్ళిపోయిన కాజల్, తమన్నా, సమంత లాంటి తారలు.. ఇప్పుడు డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. సీనియర్ హీరోలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారిన ఈ హీరోయిన్స్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో వెబ్ సీరీస్ కి ప్రాధాన్యతనిస్తున్నారు. కాజల్ ఆచార్య, ఇండియన్ 2, ప్రవీణ్ సత్తారు సినిమాలతో పాటుగా ఓ వెబ్ సీరీస్ చేసింది. అలాగే తమన్నా సీటిమార్ మూవీ తో పాటుగా ఇప్పటికే 11th అవర్ అలాగే హాట్ స్టార్ కోసం నవంబర్ స్టోరీస్ వెబ్ సీరీస్ చేసింది. ఇక సమంత పెళ్లయ్యాక కూడా ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తుంది. శాకుంతలంతో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్న సమంత తమిళ్ లో మరో మూవీలో నటిస్తుంది. అయితే సమంత తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పాన్ ఇండియా లెవల్లో చేసింది.
అయితే కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత సిల్వర్ స్క్రీన్ మీద పోటాపోటిగా హిట్స్, ప్లాప్స్ అందుకున్నా.. కాజల్ అగర్వాల్ కి తమన్నాలకి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కలిసిరాలేదనిపిస్తుంది. అంటే కాజల్ నటించిన లైవ్ టెలికాస్ట్, తమన్నా నటించిన 11th అవర్, నవంబర్ స్టోరీస్ కి అంతగా పేరు రాలేదు. ఆ సీరీస్ సో సో గా అనిపించాయి. దాదాపుగా వెబ్ సీరీస్ లో వాళ్లిద్దరూ ఫెయిల్ అయినట్లే. ఇక సమంత నటించిన వెబ్ సిరీస్ ఫామిలీ మ్యాన్ జూన్ 4 న రిలీజ్ కాబోతుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్, లుక్స్, పోస్టర్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ సీజన్ 2 బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరి ఈ వెబ్ సీరీస్ లో కాజల్, తమన్నా ఫెయిల్ అయ్యారు. ఇక సమంత ఏం చేస్తుందో అంటే.. సమంత పక్క బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫాన్స్. మరి జూన్ 4 వరకు వెయిట్ చేస్తే సమంత విషయమూ తేలిపోతుంది.