ప్రపంచంలోనే కరోనాతో అత్యధిక మరణాలు కలిగిన దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది మొదలు.. కరోనా కేసులు మూడు నుండి నాలుగు లక్షల కేసులు డైలీ నమోదు అవుతున్నాయి.. మూడు నుండి నాలుగు వేల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మే సెకండ్ వీక్ లో నాలుగున్నర లక్షల కేసులో నమోదైన ఇండియా గురించి ప్రపంచ దేశాలు జాలి చూపించాయి. ఇండియా కి పెద్ద మొత్తంలో సహాయం అందించడానికి ముందుకు వచ్చాయి. రాష్ట్రాల్లో కరోనా తో అల్లాడుతున్న ప్రజలకి ఆక్సిజెన్ సరఫరా కూడా చేసాయి మరి కొన్ని దేశాలు.
దేశ రాజధాని ఢిల్లీ కరోనా అల్లకల్లోలం ఎలా ఉందొ ప్రతి రోజూ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. దేశ రాజధాని, ఆర్ధిక రాజధాని లలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం అన్నిటికన్నా ఎక్కువ ఉంది. కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాలు కరోనా సెకండ్ వెవ్ ఉధృతికి ఒణికిపోయాయి. అయితే మే ఫస్ట్ నుండి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు పెట్టెయ్యడంతో.. డైలీ కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. నిన్న మొన్నటి వారికి రెండున్నర నుండి మూడు లక్షల కరోనా కేసులు రోజువారీ చూపించగా.. తాజాగా నిన్న భారత దేశం కరోనా కేసులు 2 లక్షలు నమోదు కావడంతో కాస్త ఊరట కనిపిస్తుంది. ఎప్పుడూ మూడు లక్షలు, నాలుగు లక్షలు, మూడున్నర లక్షలు, రెండున్నర లక్షలు విన్న వారు ఇప్పుడు రెండు లక్షలు కేసులు చూసి హమ్మయ్య నిజంగా వినడానికి ఇది గుడ్ న్యూస్ అంటున్నారు.
మే మొదటి వారంలో నాలుగు లక్షల డైలీ కరోనా కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూల ప్రభావంతో.. రోజుకి రెండు లక్షల దిగువుకు చేరుకున్నాయి.. మరో నెల రోజు లాక్ డౌన్ కంటిన్యూ చేస్తే గనక ఈ కేసులు మరింతగా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు.