Advertisementt

స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడు

Tue 25th May 2021 08:34 PM
jabardasth hari,haritha,hari arrest in red sandal smuggling  స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడు
Jabardasth Artist Hari Arrest In Red Sandal Smuggling Case స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ నటులు కాంట్రవర్సీలలో చిక్కుకోవడం కొత్తేమి కాదు. హైపర్ అది స్కిట్ లో చేసే పరదేశి, దొరబాబు లు వైజాగ్ లో జరిగిన రైడింగ్ లో పట్టుబడి జైలు కి వెళ్లివచ్చారు. అయినా జబర్దస్త్ లో ఆది స్కిట్ లో కొనసాగడమే కాదు.. ఆ వైజాగ్ ఇష్యూ మీద ఆది డైరెక్ట్ గానే జబర్దస్త్ స్టేజ్ మీద పంచెలు వెయ్యడం చూస్తూనే ఉంటాము. అయితే గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో బుక్ అయిన.. జబర్దస్త్ హరిత అలియాస్ హరి మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పోలీస్ ల చేతికి చిక్కినట్లుగా అని తెలుస్తుంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ లో అనేకమంది హస్తాలు ఉండడం, అక్కడ శేషాచలం అడవుల్లో బోలెడంతమంది కూలీలని పోలీస్ లు పట్టుకోవడం, స్మగ్లర్స్ ని పోలీస్ లు అరెస్ట్ లు కూడా చెయ్యడం తరచూ చూస్తూనే ఉంటాము. తాజాగా చిత్తూరు శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర ప్రమాదకరమైన ఆయుధాలను మూడు లక్షల విలువైన ఎర్రచందం దుంగలను పోలీస్ లు పట్టుకున్నారని, ఈ స్మగ్లింగ్ తో జబర్దస్త్ హరికి సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు పలు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి.

Jabardasth Artist Hari Arrest In Red Sandal Smuggling Case:

Jabardasth Hari Arrest In Red Sandal Smuggling Case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ