ఫిదా మూవీ తో సూపర్ పెరఫామెన్స్ తో ఆకట్టుకుని, మరోసారి సారంగా దారియా గా మన ముందుకు రాబోతున్న సాయి పల్లవి.. తాను తెలుగులో నటించిన లవ్ స్టోరీ, విరాట పర్వం మూవీస్ కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడినా.. ఆమె మలయాళంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అథిరన్ మూవీ తెలుగులో అనుకోని అతిధిగా డబ్ అయ్యి.. మే 28 శుక్రవారం ఆహా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి - ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన అనుకోని అతిధి టీజర్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది టీం.
ఈ సినిమాలో సాయి పల్లవి మానసిక సమస్య ఉన్న అమ్మాయిల నటించింది. ఈ ట్రైలర్ లో మానసిక సమస్యతో బాధపడే పాత్రలో సాయిపల్లవి పెరఫార్మెన్స్ అట్రాక్ట్ చేస్తోంది. ఓ బంగ్లా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ పెంచేశాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగులోనూ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగులో సాయి పల్లవి స్టార్ డం, పుష్ప విలన్ గా ఎంటర్ అవుతున్న ఫహద్ ఫాజిల్ క్రేజ్ అన్ని ఈ సినిమాకి ప్లస్ అవడం మాత్రం పక్కా.