స్టార్ మా లో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 నిమిషాలకు ప్రసారంవుతున్న కార్తీక దీపం సీరియల్ కి బోలెడంత మంది బుల్లితెర ఫాన్స్ ఉన్నారు. కార్తీక్ - దీప కన్నా ఎక్కువగా డాక్టర్ బాబు - వంటలక్క గా ప్రేక్షకుల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్నారు. అయితే ప్రస్తుతం సీరియల్ లో సూపర్ ట్విస్ట్ లు కనిపిస్తున్నాయి. డాక్టర్ బాబు పదేళ్లుగా వంటలక్క అవమానిస్తూ వేధిస్తున్నాడు. దీప కూడా ఆత్మాభిమానులు అంటూ పిల్లలతో నానా కష్టాలు పడడం ప్రేక్షగాకులు ఎమోషనల్ గా తీసుకుని ఆ సీరియల్ ని టాప్ లో ఉంచుతున్నారు. ప్రస్తుతం దీప లంగ్స్ ప్రాబ్లెమ్ తో సీరియస్ సిట్యువేషన్ తో హాస్పిటల్ లో ఉండగా.. దీప పవిత్రని తెలుసుకున్న డాక్టర్ బాబు కార్తీక్.. దీప మీద ప్రేమతో దగ్గరికి తీసుకోబోతున్నాడు.
దీప - కార్తీక్ ప్రేమతో మాట్లాడుకోవడం చూస్తారంటూ.. మోనిత కోపంతో రగిలిపోతున్న సీన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో చూపించబోతున్నారు. అయితే స్టార్ మాలో రాత్రి రావాల్సిన సీరియల్స్ ని స్టార్ మా.. హాట్ స్టార్ లో ఉదయమే ఆ ఎపిసోడ్స్ ని అప్ లోడ్ చేస్తుంటుంది. కానీ ఈరోజు హాట్ స్టార్ లో కార్తీక దీపం కానీ, వేరే ఇతర ఏ సీరియల్స్ అప్ లోడ్ చెయ్యలేదు. అంటే లాక్ డౌన్ కారణంగా సీరియల్స్ షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. సో కార్తీక దీపం షూట్ చేసిన ఎపిసోడ్స్ కూడా ఫినిష్ అయ్యాయేమో.. అందుకే హాట్ స్టార్ లో ఆ సీరియల్స్ అప్ డేట్స్ పెట్టలేదు అనుకుంటున్నారు. లేదంటే ఉదయం 9 గంటలకల్లా కార్తీక మాసం సీరియల్ అప్ డేట్ ప్రేక్షకుల ముందు ఉండేది. మరి లాక్ డౌన్ అయ్యేవరకు ప్రేక్షకులు ఈ సీరియల్స్ ని మిస్ అయినట్లే.