రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీపై పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ అంచనాలు ఉన్నాయి. ట్రేడ్ లోనూ విపరీతమైన హైప్ ఉంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ లుక్స్ చూసాక సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇక సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 13 నే విడుదల చెయ్యాలని రాజమౌళి ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ బర్త్ డే పోస్టర్ లో అక్టోబర్ 13 నే ఉంచేశారు. అయితే ఇప్పటికే అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్న ఆర్.ఆర్.ఆర్ పై జక్కన్న ఫాదర్, ఆర్.ఆర్.ఆర్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు మరిన్ని అంచనాలు పెరిగేలా చేసారు. తాజాగా అయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..
మన సినిమా ఆర్.ఆర్.ఆర్ గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు.. ఆర్.ఆర్.ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా యాక్షన్ మూవీలో యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఫాన్స్ కుర్చీల మీదకెక్కి విజిల్స్ వెయ్యడం, చప్పట్లు కొట్టడం చేస్తారు. కానీ ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సన్నివేశాలు చూస్తే నాకు కన్నీళ్లు వచ్చేసాయి. నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. అదే భావన ప్రేక్షకులు కూడా తప్పకుండా పొందుతారు.. ఆ విషయం నేను పక్కాగా చెప్పగలను. ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా ఫాన్స్, ఆడియన్స్ ఎమోషనల్ గా ఫీలవుతారు అంటూ విజయేంద్ర ప్రసాద్ గారు సినిమాపై ఇంకా అంచనాలు పెంచేశారు.