ప్రస్తుతం దేశం మొత్తం మీద లాక్ డౌన్, కర్ఫ్యూలతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజుకి నాలుగు లక్షల పైమాటే కరోనా కేసులు నమోదైన నాటి నుండి లాక్ డౌన్ పెట్టిన నెలలోపు ఆ కేసులు రెండు లక్షల దిగువుకు చేరాయి. దానితో అధిక రాష్ట్రాలు లాక్ డౌన్ ని పొడిగించే ఆలోచనలోనే ఉన్నాయి. ఇక తెలంగాణాలో గత 15 రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ తెలంగాణాలో సత్ఫలితాలను ఇస్తున్నట్లే అంటున్నారు. కరోనా కేసులు తగ్గడం, హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత లేకపోవడంతో తెలంగాణాలో కరోనా కాస్త కంట్రోల్ కి వచ్చినట్టే కనిపిస్తుంది.
మే 11 నుండి మే 21 వరకు పది రోజుల పాటు లాక్ డౌన్ విధించిన కేసీఆర్ ప్రభుత్వం.. మరోసారి లాక్ డౌన్ ని మే 30 వరకు పొడిగించింది. లాక్ డౌన్ లో కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. కాబట్టే కేసులు తగ్గుతున్నాయని హెల్త్ డైరెక్టర్ రమేష్ చెబుతున్నారు. అయితే మే 30 నుండి మరోసారి లాక్ డౌన్ ని తెలంగాణ ప్రభుత్వం పొడిగించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరో పది రోజుల పాటు కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. మే 30 మధ్యాన్నం 2.30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యి లాక్ డౌన్, కరోనా తదితర అంశాలపై చర్చించి లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.