Advertisementt

అవసరమైతే డైరెక్షన్ చేస్తా అంటున్న చిట్టి

Thu 27th May 2021 10:35 AM
faria abdullah,jathi ratnalu,dancer,painter  అవసరమైతే డైరెక్షన్ చేస్తా అంటున్న చిట్టి
Jathi Ratnalu Faria Abdullah is a dancer, painter అవసరమైతే డైరెక్షన్ చేస్తా అంటున్న చిట్టి
Advertisement
Ads by CJ

నాగ్ అశ్విన్ లయోలా కాలేజ్ కి వస్తున్నాడని తెలిసి అవకాశం కోసం ఆయన్ని కలిసి.. త్వరలోనే కొత్త కథతో సినిమా మొదలు పెడుతున్నామని చెప్పగానే ఆడిషన్స్ కి వెళ్లి కామెడీ ఎంటర్టైనర్ జాతి రత్నాలులో హీరోయిన్ చిట్టి గా సెలెక్ట్ అయ్యి.. కామెడీ బ్లాక్ బస్టర్ లో భాగం పంచుకున్న ఫారియా అబ్దుల్లాకి.. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది. సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి చిట్టికి డాన్స్ నేర్పిస్తాడు. కానీ ఫారియా స్వతహాగా మంచి డాన్సర్ అంటుంది. తనకి డాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది అంటుంది. అలాగే జాతి రత్నాలు తర్వాత తెలుగులో కొత్త సినిమా కథలు వింటున్నా అని.. అందులో పెరఫార్మెన్స్ కి ప్రాధాన్యం ఉండే పాత్రలని చెయ్యాలనే ఉద్దేశ్యం ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా చెబుతుంది. 

ఇక కేవలం తెలుగు హీరోయిన్ లా తెలుగుకే పరిమితం కానీ.. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధం.. అంటుంది. కేవలం సినిమాలు, హీరోయిన్ పాత్రలు అనే గిరి గీసుకుని కూర్చొను,  ఓటీటీలో వచ్చే వెబ్‌ సిరీస్‌లలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చేస్తాను అంటుంది. ఇంకా నాకు చాలా ఇష్టమైన రంగాలు ఉన్నాయి. ఒకవేళ సినిమాలు చెయ్యకపోతే వాటిలో ఏదో ఒకటి చేస్తాను. ఒకవేళ సినిమాల్లోనే ఉంటే.. ఏదో ఒక రోజు సినిమా డైరెక్షన్ కూడా చేస్తా అంటుంది ఫారియా అబ్దుల్లా. 

Jathi Ratnalu Faria Abdullah is a dancer, painter:

Jathi Ratnalu Faria Abdullah special activies 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ