కరోనా సెకండ్ వేవ్ రావడం రావడమే థియేటర్స్ మీద ప్రభావం చూపించింది. ఏప్రిల్ 16 నుండి థియేటర్స్ 50 ఆక్యుపెన్సీ మీద రన్ అవడం, తర్వాత నైట్ కర్ఫ్యూ తో థియేటర్స్ ని మొత్తం క్లోజ్ చెయ్యడంతో విడుదలకు సిద్దమైన నాగ చైతన్య లవ్ స్టోరీ, తర్వాత నాని టక్ జగదీశ్, తర్వాత రానా విరాట పర్వం మూవీలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక షూటింగ్స్ ఇంకా పూర్తికాని ఆచార్య లాంటి సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఓటిటి బాట పడుతున్నాయని అంటూ న్యూస్ లు సోషల్ మీడియాలో ప్రచారంలోకొస్తున్నాయి. అందులో ఇప్పటికే విశ్వక్ సేన్ పాగల్, విరాట పర్వం, నారప్ప, దృశ్యం 2, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీస్ ఓటిటి నుండి రిలీజ్ కాబోతున్నాయంటూ ప్రచారం మొదలవగా..
అందులో రవితేజ ఖిలాడీ టీం పోస్టర్ తో సహా మా సినిమా ఓన్లీ థియేటర్స్ అనగా.. విశ్వక్ సేన్ పాగల్, విరాట పర్వం టీం, దృశ్యం, నారప్ప నిర్మాత తో పాటుగా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లోనే విడుదల చేస్తాం కానీ.. ఓటిటి నుండి కాదంటూ క్లారిటీ ఇవ్వగా.. తాజాగా నాని టక్ జగదీశ్ మూవీని నాని ఓటిటికి అమ్మేస్తున్నాడని అంటున్నారు. గతంలో నాని వి కూడా ఓటిటి నుండే రిలీజ్ అవడంతో ఆ వార్తలకు ఊతమిచ్చింది. దానితో టీం హడావిడిగా నాని నటించిన టక్ జగదీష్ సినిమాను పరిస్థితులు అనుకూలించిన తర్వాత థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదలవుతుందనే పుకార్లకు పులిస్టాప్ పెట్టారు.