కన్నడ నుండి టాలీవుడ్ కి దూసుకొచ్చిన గ్లామర్ డాల్ రష్మిక మందన్న రేంజ్ ఇప్పడు పాన్ ఇండియా లెవల్లో ఉంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు రష్మిక మందన్న ఫుల్ బిజీ. సినిమాలతో క్షణం తీరిక లేకుండా స్టార్ హీరోస్ ని చుట్టేస్తున్న రష్మిక గ్లామర్ కి, పెరఫార్మెన్స్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యిపోయింది. కాబట్టే అక్కడ అమ్మడుకి వరస అవకాశాలు. తెలుగులో మహేష్ బాబుతో నటించిన రష్మిక తర్వాత అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప లో నటిస్తుంది. బాలీవుడ్ లో మూడు క్రేజీ ఆఫర్స్ తో బిజీగా ఉన్న పాప విజయ్ దేవరకొండ తో డీప్ ఫ్రెండ్ షిప్ లో ఉంది.
అయితే తాజాగా రష్మిక ని మీరు డేటింగ్ కి వెళ్ళాలి అనుకుంటే ఏ హీరో తో వెళతారు అనగానే.. తెలుగు స్టార్ హీరోతో తాను డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పి షాకిచ్చింది. అందరూ అది విజయ్ దేవరకొండ అయ్యుంటాడని అనుకునేలోపే.. ఆ స్టార్ ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అంటూ చెప్పి మరింత షాకిచ్చింది. తనకు గనక అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ఎందుకంటే తాను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ ని అని అందుకే ప్రభాస్ తో అవకాశం వస్తే ఖచ్చితంగా డేట్ కి వెళతాను అంటుంది కన్నడ బ్యూటీ రష్మిక. మరి రశ్మికది కూడా పాన్ ఇండియా లెవల్.. ప్రభాస్ ఏమైనా రష్మిక కి తన పాన్ ఇండియా మూవీస్ లో ఛాన్స్ ఇస్తాడేమో చూద్దాం.