హీరోయిన్స్ కి పెళ్ళయాక వాళ్ళ కెరీర్ తో పాటుగా గ్లామర్ కూడా పోతుంది అనుకుని.. చాలామంది వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు. అందులో నార్త్ సైడ్ ఎలా ఉన్నా.. సౌత్ హీరోయిన్స్ కి పెళ్లి అంటేనే కెరీర్ పోతుంది అనే భయం బాగా ఉంటుంది. అందుకే మూడు పదులు దాటి నాలుగో పదిలోకి ఎంటర్ అయినా పెళ్లిపై ఫోకస్ పెట్టారు. అయితే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలనే కాన్సప్ట్ సమంత ది. అందుకే నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడింది. అయితేనేం పెళ్లి సినిమాలకి, కెరీర్ కి అడ్డుకాదని నిరూపించేసింది. ఇప్పటికి గ్లామర్ గా సమంత ఎక్కడా తగ్గదు. ఇక మరో నటి కాజల్ పెళ్లి వయసు దాటినాక పెళ్లికి చేసుకున్నా కెరీర్ కి దూరం కాలేదు.
తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ని లాక్ డౌన్ టైం లో పెళ్ళాడి సినిమాలు చేసుకుంటున్న కాజల్ అందంలో, గ్లామర్ లో ఎలాంటి మార్పు లేదు. పెళ్ళికి ముందుగా ఎంత గ్లామర్ గా ఫిట్ గా ఉండేదో.. పెళ్లి తర్వాత సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ మాత్రం అందాలు ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు. ఈమధ్యన మార్నింగ్ వైబ్స్ అంటూ కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్.. తాజాగా పోస్ట్ చేసిన పిక్ చూస్తే మతి పోవాల్సిందే. బిగుతైన అందాలతో కాజల్ అగర్వాల్ ని లూజ్ హెయిర్ తో అలా చూస్తుంటే.. అమ్మో పెళ్లయిన కాజల్ గ్లామర్ ఇసుమంతైనా తగ్గలేదు అంటారు. నిజంగా కాజల్ పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్ ఆమె పెళ్లి తర్వాత తీసింది. ఎంత అందంగా, నాజూగ్గా, మెరిసిపోతుందో మీరు ఆ పిక్ ని ఓ లుక్కెయ్యండి.