Advertisementt

సూపర్ స్టార్ డైలమా

Thu 27th May 2021 09:23 PM
superstar rajinikanth,rajini fans,movies,rajinikanth new movie,rajini health problems,politics  సూపర్ స్టార్ డైలమా
Rajinikanth to quit films? సూపర్ స్టార్ డైలమా
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లోనే కాదు సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయకుడు ఎవరంటే.. రజినీకాంత్ అంటారు. ఈ ఏజ్ లోను రజినీకాంత్ కి అభిమానుల సంఖ్య ని చూస్తే మాములుగా ఉండరు. ఆయన సినిమాల నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని వారు కోరుకున్నా రజినీకాంత్ ఆరోగ్యం ఆయన్ని రాజకీయాల్లోకి రానివ్వడం లేదు. ఇక వయసుతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్న రజినీకాంత్ ఆ మధ్యన సినిమాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది డిసెంబర్ లో బాగా సిక్ అయ్యి.. అటు రాజకీయాలను పూర్తిగా వదిలేసి.. ఇటు సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చారు సూపర్ స్టార్.

ఇక ఈ ఏడాది మార్చ్ నుండి మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్న రజినీకాంత్ శివ దర్శకత్వంలో అన్నాత్తె షూటింగ్ ని హైదరాబాద్ లో ఏకధాటిగా 45 రోజుల పాటు చేసి షూటింగ్ ముగించేసి చెన్నై కి వెళ్లిపోయిన రజినీకాంత్ కి మరికొన్నాళ్లు సినిమాలు చెయ్యాలని ఉన్నా.. ఆరోగ్యం సహకరించాలిగా అంటున్నారు. మరికొన్నాళ్లు తనకి సినిమాల్లో నటించాలని ఉంది. కానీ ఆరోగ్యం సహకరిస్తుందో లెదో అంటూ అభిమానులని డైలమాలో పెట్టేసారు. కరోనా తగ్గి, పరిస్థితులు చక్కపడితే ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నట్లు రజినీకాంత్ చెప్పినట్లుగా టాక్. ఈ మధ్యనే రజినీకాంత్ అమెరికా వెళ్ళబోతున్నారని రెండు నెలల పాటు అక్కడే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.

మరి రజినీకాంత్ ఇలా అంటున్నారు అంటే.. తాను సినిమాల నుండి పూర్తిగా తప్పుకోబోతున్నట్టుగా అభిమానులకి ఈ రకంగా హింట్ ఇచ్చినట్టేనా?

Rajinikanth to quit films?:

Superstar Rajinikanth to quit films?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ