దేశ రాజధాని కరోనా సెకండ్ వేవ్ తో అతలాకుతలమవడమే కాదు.. ఆక్సిజెన్ కోసం దేశ ప్రధానినే నిలదీసారు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ లో ప్రజలు సెకండ్ వెవ్ టైం లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. రోజు రోజుకి కరోనా తో పోజిటివిటి రేటు పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఢిల్లీ లో లాక్ డౌన్ విధించారు. మొదట వారం మాత్రమే అంటూ లాక్ డౌన్ పెట్టినా అది దాదాపుగా మూడు నుండి నాలుగు వారాల పాటు అమలవడంతో అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలు కొలిక్కి వచ్చాయి. కరోనా కేసులు తగ్గుదలతో ఇప్పుడు కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అది సోమవారం నుండి కొంచెం కొంచెం లాక్ డౌన్ ని సడలిస్తూ అన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆదివారం వరకు పూర్తిలాక్ డౌన్ అమలు చేసి సోమవారం నుండి ఢిల్లీ లో అన్ లాక్ ప్రక్రియని చేపట్టబోతున్నట్టుగా క్రేజీవాల్ తెలిపారు. లాక్ డౌన్ వలన ప్రజలు, ప్రభుత్వాలు నష్టపోతున్నా కరోనా కంట్రోల్ కోసం లాక్ డౌన్ పెట్టక తప్పని పరిస్థితుల్లో ఉన్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గడంతో ఆ రాష్ట్రంలోనూ అక్కడక్కడా లాక్ డౌన్ సడలింపు ప్రక్రియ మొదలయ్యింది.