Advertisementt

ప్రయోగాల ప్రశాంత్ వర్మ

Sat 29th May 2021 01:31 PM
prashanth varma,hanu-man movie,prashanth varma hanu-man,hanu-man first look video,prashanth varma birthday special  ప్రయోగాల ప్రశాంత్ వర్మ
Hanu-Man First Look ప్రయోగాల ప్రశాంత్ వర్మ
Advertisement
Ads by CJ

కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుండి చేసిన సినిమాలన్ని ప్రయోగాలు తో చేసినవే. అ .., కల్కి, జాంబి రెడ్డి.. కల్కి కమర్షియల్ ఫార్మేట్ చేసినా అది సక్సెస్ కాలేదు. ఆ సినిమాకి అవార్డులొచ్చాయి. ఇక రీసెంట్ గా జాంబిరెడ్డి ప్రశాంత్ అనుకున్న అంచనాలను రీచ్ అయ్యింది. తాజాగా ప్రశాంత్ నీల్ జంబి రెడ్డి సీక్వెల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని, కాదు స్టార్ హీరో తో సినిమా మొదలు పెట్టబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రశాంత్ నీల్ మరోసారి మరో ప్రయోగానికి తెర లేపాడు. మే 29 ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా తన నుంచి కొత్త సినిమా అప్డేట్ రాబోతుంది అని నిన్ననే హింట్ ఇచ్చాడు.

చెప్పినట్టుగానే ప్రశాంత్ వర్మ బర్త్ డే ట్రీట్ గ తన కొత్త సినిమా మోషన్ పోస్టర్ ని రివీల్ చేసాడు. హనుమాన్ టైటిల్ తో పాటుగా ఓ వీడియో ని షేర్ చేసాడు. అయితే కథ .. కాన్సెప్ట్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. 

తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్‌ జానర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి మరింత కొత్తగా, లార్జ్‌ స్కేల్‌లో ఈ చిత్రం ఉండబోతుంది అని తెలిపారు. ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ హను–మాన్‌ టైటిల్, మోషన్‌ పోస్టర్‌ను మే 29న విడుదల చేశారు. మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి.

హాలీవుడ్‌ను సూపర్‌హీరోస్‌ మూవీస్‌ రూల్‌ చేస్తున్నాయి. డిస్నీ, మార్వెల్‌ సూపర్‌హీరోస్‌ ఫిల్మ్స్‌ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఇటీవల విడుదలైన సూపర్‌హీరో ఫిల్మ్‌ అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళను రాబట్టింది. ఈ సూపర్‌హీరో ఫిల్మ్‌ జానర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. సూపర్‌హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌రకు రప్పిస్తాయి.

భారతీయ పురాణాల నుంచి హను-మాన్ సినిమాకు స్ఫూర్తి పొందాము. భారతీయులుకు హనుమాన్‌ సూపర్‌హీరో. ఈ సినిమా టైటిల్‌లో హను మాన్ మధ్యలో వజ్రంతో ఉన్న సూర్యుడి లొగొ ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఇప్పటికే విడుదలైన హనుమాన్‌ మోషన్‌ పోస్టర్‌ విజువల్‌ అద్భుతంగా ఉండి మంచి స్పందన లభిస్తుంది. మోషన్‌ పోస్టర్‌లోని హిమాలయాల విజువల్స్‌ అత్యద్భుతం.

Hanu-Man First Look :

Prashanth Varma Hanu-Man First Look revealed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ