Advertisementt

విజయ్ తో కన్ ఫర్మ్ చేసిన వంశి పైడిపల్లి

Sun 30th May 2021 10:56 AM
thalapathy 66,vamshi paidipally,confirms,vijay,dil raju,vamshi paidipally - vijay combo  విజయ్ తో కన్ ఫర్మ్ చేసిన వంశి పైడిపల్లి
Vamshi Paidipally confirms his next with Vijay విజయ్ తో కన్ ఫర్మ్ చేసిన వంశి పైడిపల్లి
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో - వంశి పైడిపల్లి - దిల్ రాజు కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ.. ఇది గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న న్యూస్. మహేష్ తో సినిమా చెయ్యాలని పనిగట్టుకుని మహేష్ వెంట పడినా పని జరగక ఇతర హీరోల డేట్స్ ఖాళీ లేక వంశి పైడిపల్లి కోలీవుడ్ హీరో విజయ్ కి స్టోరీ లైన్ చెప్పడం, దిల్ రాజు విజయ్ కోసం మంతనాలు జరపడంతో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది అన్నా.. అందరిలో ఎక్కడో ఒక అనుమానం. అయితే తాజాగా ఆ అనుమానాలను పటా పంచాంగాలు చేస్తూ #Thalapathy66 వంశి పైపల్లి - విజయ్ కాంబోలో తెరకెక్కబోతున్నట్లుగా వంశి పైడిపల్లి కంఫర్మ్ చేసాడు. 

రాజు గారు బ్యానర్ లో విజయ్ తో ఓ సినిమాని చేయబోతున్నా అని.. అది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అని, కరోనా పరిస్థితులు ఇలా ఉండబట్టి ఆ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ ఇంకా జరగలేదని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటిస్తామని, ప్రస్తుతం ఇదే చెప్పగలను అని.. మిగతావన్నీ సస్పెన్స్ అంటూ నిజంగానే వంశి పైడిపల్లి సస్పెన్స్ క్రియేట్ చేసాడు. ఇప్పటివరకు నేను ఒకటికన్నా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒకేసారి చేయలేదు. డైరెక్టర్స్ సినీ జీవితం అతని చివరి సినిమా ఎలా ఆడింది అనే దానిపైనే ఉంటుంది అని, దీని వల్ల ఒక సమస్యని ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే నేను స్వభవరీత్యా రైటర్ ని కాను.. అందుకే నా సినిమాల కోసం నేను రైటర్స్ మీద ఆధారపడి ఉండాల్సి ఉంది. 

ఒక సినిమా పూర్తయ్యాక మరో కథ కోసం వెతకడానికే కాలం కరిగిపోతుంది. అందుకే విజయ్ తర్వాత చేసే ప్రాజెక్ట్ కథని కూడా ముందే చూసుకుంటున్నా అంటూ వంశి పైడిపల్లి చెప్పడంతో.. సోషల్ మీడియాలో #DilRaju, #Thalapathy66 హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Vamshi Paidipally confirms his next with Vijay:

Thalapathy 66: Vamshi Paidipally Confirms Teaming Up With Vijay

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ