Advertisementt

రోజా వద్దు.. ఇంద్రజ ముద్దు

Sun 30th May 2021 01:15 PM
roja,roja selvamani,re entry,jabardasth,extra jabardasth,indraja  రోజా వద్దు.. ఇంద్రజ ముద్దు
Roja Re entry to Jabardasth రోజా వద్దు.. ఇంద్రజ ముద్దు
Advertisement
Ads by CJ

గత ఎనిమిదేళ్లుగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లకు జేడ్జ్ ప్లేస్ లో కూర్చుంటున్న రోజా సెల్వమణి.. మధ్యలో ఏదైనా ఫ్యామిలీ టూర్, లేదా పొలిటికల్ గా బాగా బిజీగా ఉంటే తప్ప జబర్దస్త్ ప్రోగ్రాం ని వదులుకోరు. కానీ ఈమధ్యన జబర్దస్త్ కి రోజా చాలారోజులు గ్యాప్ ఇచ్చింది. ఆరోగ్యకారణాల దృష్యా రోజా కొన్నాళ్లుగా జబర్దస్త్ జేడ్జ్ ప్లేస్ లో కనిపించడం లేదు. ఆ ప్లేస్ లోకి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వచ్చి చేరింది. ఆమె కూడా రోజాలానే కమెడియన్స్ తో కలిసిపోయి, వాళ్ళ పంచ్ లకు ఎదురు పంచ్ లు వేస్తూ స్టేజ్ మీదకి రాగానే ఎనేర్జిగా డాన్స్ లు చేస్తూ జబర్దస్త్ జేడ్జ్ గా అదరగొట్టేసింది. 

అయితే అలా జేడ్జ్ గా ఫిక్స్ అవుతుంది అనుకున్న టైం లో రోజా జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చేసింది. గత వారమే జబర్దస్త్ లో కనిపించిన రోజా వచ్చే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ల్లో జేడ్జ్ గా వచ్చేసింది. దానితో ఇంద్రజ ఇంక రాదని అందరూ ఫిక్స్ అయ్యారు కూడా.. ఆమె రానందుకు డిస్పాయింట్ అయిన వారు లేకపోలేదు. కానీ కొంతమంది మాత్రం ఇంద్రజ జబర్దస్త్ జేడ్జ్ గా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఆమెనే కంటిన్యూ చేస్తే బావుంటుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మంచి స్మైల్ తో కమెడియన్స్ తో బాగా ఇంటరాక్ట్ అవుతూ అదరగొడుతున్న ఇంద్రజాని తప్పించడం ఎందుకు అంటున్నారు. అంతేకాకుండా కొంతమంది కామెడీ ప్రియులు ఈమధ్యన మేము ఇంద్రజ కోసమే జబర్దస్త్ షో చూస్తున్నామంటూ మల్లెమాలకి మెసేజ్ లు పంపడం ఇంట్రెస్టింగ్ గా మరింది. 

Roja Re entry to Jabardasth:

Roja Re entry to Jabardasth and Extra Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ