ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు గురించే హాట్ టాపిక్. ఆనందయ్య మందు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. ఇంకా చాల రాష్ట్రాల నుండి ఆనందయ్య మందు కోసం ఎగబడగా ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందు గురించి శాస్త్రీయ పరిశోధన చెయ్యాలని అధికారులని ఆదేశించి ఆనందయ్యకి పోలీస్ ప్రొటక్షన్ కలిపించి ఆయన మందు తయారీని ఆపేసారు. ప్రస్తుతం ఆనందయ్య ఆయుర్వేదం మందు పై ఏపీ హై కోర్టులో కేసు విచారణలో ఉంది.
అయితే కృష్ణ పట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు అంతలా పబ్లిసిటీ అవడానికి కారణం రిటైడ్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య. కరోనా తో తాను చావు బతుకుల మధ్యన కృష్ణపట్నం వెళ్లి ఆనందయ్య మందు కళ్లలో రెండు డ్రాప్స్ వేసుకోగానే లేచి కూర్చున్నా అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో.. అది కాస్తా వైరల్ అయ్యి ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎగబడ్డారు.
అయితే కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజుల అనంతరం కోటయ్య ఆరోగ్యం క్షీణించడంతో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. ఆనందయ్య మందు వలన అయన కంటి చూపుకి ప్రమాదం ఏర్పడింది అని, ఆనందయ్య ఆయుర్వేదం మందులో జిల్లేడు పువ్వుల వినియోగం కారణంగా ఆయన కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా ఆయనని జాయిన్ చేసుకున్న జీజీహెచ్ డాక్టర్స్ చెప్పారు. అప్పటినుండి హాస్పిటల్ లోనే ఉన్న కోటయ్య కి నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం మరింతగా విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అయినా కోలుకోకపోగా కోటయ్య మరణించనట్లుగా జిజిఏహెచ్ వైద్యులు ప్రకటించారు.