Advertisementt

ప్రేయసి కోసం కాస్ట్లీ విల్లాని కొన్న హీరో

Mon 31st May 2021 12:52 PM
arjun kapoor,23-crore,4-bhk flat,malaika arora home  ప్రేయసి కోసం కాస్ట్లీ విల్లాని కొన్న హీరో
Arjun Kapoor buys swanky Rs 23-crore 4-bhk flat ప్రేయసి కోసం కాస్ట్లీ విల్లాని కొన్న హీరో
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో చాలామంది ప్రేమికుల జంటలు.. ప్రేమ తర్వాత పెళ్లి కోసం పెళ్లి పీటలెక్కుతున్నా.. ఓ యంగ్ హీరో మాత్రం తన ప్రియురాలితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటాడు కానీ.. పెళ్లి పేరెత్తడు. అతనెవరో కాదు యంగ్ హీరో అర్జున్ కపూర్. సల్మాన్ సోదరుడి భార్య మలైకా అరోరాతో ఎప్పటినుండో రిలేషన్ లో ఉన్న అర్జున్ కపూర్ మలైకా తో కలిసి దేశవిదేశలను తిరుగుతాడు. రెస్టారెంట్స్ కి, గోవాకి అబ్బో వెకేషన్స్ అంటూ తిరగని చోటు ఉండదు. ఎయిర్ పోర్ట్ లోనూ, ఎక్కడ చూసినా వీరి దర్శనమే. కాకపోతే పెళ్లి గిళ్లి జాన్తా నై.. ఇలానే బావుంటుంది అంటుంది ఈ జంట. 

అయితే తాజాగా మలైకా అరోరా ఇంటి దగ్గరలోనే అర్జున్ కపూర్ 23 కోట్లు ఖర్చు చేసి ఓ కాస్ట్లీ విల్లాని కొను చేసాడని, బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరూ నివాసం ఉండే కాస్ట్లీ ప్రాంతమైన బాంద్రా లో అర్జున్ కపూర్ 4 బెడ్ రూమ్స్ ఉన్న విల్లాని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. సోదరి అన్షులా తో కలిసి ఉంటున్న అర్జున్ కపూర్.. ఇప్పుడు మలైకా కి మరింత దగ్గర గా ఉండేలా బాంద్రాలో ఈ విల్లాని కొనుగోలు చేశాడంటూ బి టౌన్ కోడై కూస్తుంది. తనకన్నా వయస్సులో పెద్దదైన మలైకా అరోరా అంటే అర్జున్ కపూర్ కి ప్రాణం. అందుకే ఆమెతో ఇన్నేళ్ళుగా రిలేషన్ లో ఉన్నా అర్జున్ కపూర్ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడు. అటు మలైకా కూడా పెళ్లి లేకపోతేనేం మేం హ్యాపీ అన్నట్టుగా హింట్స్ ఇస్తుంటుంది. 

Arjun Kapoor buys swanky Rs 23-crore 4-bhk flat:

Arjun Kapoor buys swanky Rs 23-crore 4-bhk flat near Malaika Arora home

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ