Advertisementt

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్

Mon 31st May 2021 02:44 PM
pranitha subhash,pranitha subhash gets married,pranitha weds nitin raju,pranitha subhash wedding news,pranitha subhash wedding photos  సైలెంట్ గా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్
Pawan Heroine gets married సైలెంట్ గా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ సరసన రభసలో సినిమాల్లో నటించినా అదృష్టం వరించని ప్రణీత సుభాష్ లాక్ డౌన్ లో సడన్ గా పెళ్లి పీటలెక్కి ఫాన్స్ కి షాకిచ్చింది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ టైం లో పేదవాళ్ళ కోసం ప్రణీత డబ్బు సహాయం మత్రమే కాదు.. చాలామంది పేదలకి ఆహారం పంపిణి చేసి అండగా నిలిచింది. అయితే లాక్ డౌన్ లో ప్రణీత సుభాష్ ఇలా సడన్ గా పెళ్లి చేసుకోవడం నిజంగా అందరికి షాకిచ్చే విషయమే. గత ఏడాది లాక్ డౌన్ లో కాజల్ ప్రియుడు గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకోగా.. ఈ ఏడాది లక్ష్మి రాయ్, మెహ్రీన్ కౌర్ లు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు.

కానీ ప్రణీతనే ఎలాంటి చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చేసింది. ఓ బిజినెస్ మ్యాన్  ని ప్రణీత నిన్న వివాహం చేసుకున్నట్లుగా ఆ ఫోటో తో పాటుగా షేర్ చేసింది. బిజినెస్ మ్యాన్ నితిన్ రాజుని ప్రణీత సుభాష్ వివాహం చేసుకుంది. చాలా ఇంపుల్ గానే ప్రణీత వివాహం జరిగినట్టుగా ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ప్రణీత సుభాష్ - నితిన్ రాజుల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pawan Heroine gets married:

Pranitha Subhash gets married

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ