Advertisementt

సర్కారు వారి పాట విలన్..?

Tue 01st Jun 2021 10:45 AM
hero arjun,arjun sarja,play villain,mahesh sarkaru vaari paata,sarkaru vaari paata movie,mahesh babu - parasuram combo  సర్కారు వారి పాట విలన్..?
Hero Arjun – A villain in Mahesh Babu Sarkaru Vaari Paata సర్కారు వారి పాట విలన్..?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో సర్కారు వారి పాట సినిమా మొదలై ఒక ఏడాది గడిచిపోయింది. గత ఏడాది లాక్ డౌన్ టైం లో కృష్ణగారి పుట్టిన రోజునాడు పూజా కార్యక్రమాలతో మొదలైన సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది జనవరి నుండే మొదలయ్యింది. ఏప్రిల్ ఎండ్ సెకండ్ వేవ్ వచ్చేవరకు సర్కారు వారి పాట షూటింగ్ కి ఎక్కడా బ్రేక్స్ వెయ్యకుండా చూసుకుంది టీం. సెకండ్ వెవ్ రావడంతో మహేష్ టీం లో కొంతమందికి కరోనా రావడంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం కీర్తి సురేష్ మహేష్ తో జోడి కడుతుంది. అయితే సినిమా మొదలై ఇన్నాళ్లయినా ఈ సినిమాలో మహేష్ తో తలపడబోయే విలన్ విషయం పరశురామ్ చెప్పడం లేదు. 

బాలీవుడ్ నుండి చాలా పేర్లు వినిపించాయి కానీ.. మహేష్ విలన్ విషయం మాత్రం తెగలేదు. అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు హీరో అర్జున్ తో ఢీ కొట్టబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అర్జున్ సర్కారు వారి పాటలో విలన్ రోల్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. సెకండ్ వేవ్ పూర్తికాగానే మొదలు కాబోయే షెడ్యూల్ లో అర్జున్ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు. ఇంతకుముందు అర్జున్ లై, రవితేజ ఖిలాడీ మూవీస్ లో విలన్ రోల్ ప్లే చేసాడు. లై అనుకున్న సక్సెస్ అయితే అవ్వలేదు. రవితేజ తో నటించిన ఖిలాడీ ఇంకా విడుదల కాలేదు.

అయితే జులైలో జరిగే న్యూ షెడ్యూల్ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో మహేష్‌ - అర్జున్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.

Hero Arjun – A villain in Mahesh Babu Sarkaru Vaari Paata:

Arjun Sarja to play villain in Sarkaru Vaari Paata?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ