Advertisementt

పుష్ప సినిమాతో తరుణ్ కి పనేమిటి

Tue 01st Jun 2021 12:46 PM
hero tarun,pushpa pan india film,allu arjun,fahad fasil,fahad fazil,sukumar,tarun dubbing in fahad  పుష్ప సినిమాతో తరుణ్ కి పనేమిటి
Tarun dubs for Fahad Faasil పుష్ప సినిమాతో తరుణ్ కి పనేమిటి
Advertisement
Ads by CJ

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా నటిస్తున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం పై రోజు రోజుకి ఆసక్తి, అంచనాలు పెరిగిపోతున్నాయి. సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నా ఇంతవరకు పెద్దగా బాలీవుడ్ నటులని పుష్ప లో భాగస్వాములుగా చేర్చలేదు. నార్త్ లో పాన్ ఇండియా మార్కెట్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది. మిగతా భాషలన్నీ ఒక ఎత్తు.. బాలీవుడ్ ఒక ఎత్తు. అయినా అల్లు అర్జున్ పుష్ప సినిమాని బాలీవుడ్ లో శక్తికి మించి ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక డీ గ్లామర్ గా నటిస్తుంది.

ఇక మరో కీలక పాత్రలో యాంకర్ అనసూయ కనిపిస్తుంటే.. కమెడియన్ కం హీరో సునీల్ కూడా పుష్ప లో కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో పుష్ప రాజ్ ని ఢీ కొట్టే విలన్ గా నటిస్తుండగా.. ఐటెం సాంగ్ కోసమా మాత్రం బాలీవుడ్ నటిని దింపే ఆలోచనలో సుకుమార్ ఉండగా. ఇప్పుడు టాలీవుడ్ హీరో ఒకరు పుష్ప టీం తో కలవబోతున్నాడట. ఒకప్పుడు లవర్ బాయ్ లా మంచి హిట్స్ కొట్టి.. తర్వాత హీరోగా కొన్నికారణాల వలన సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన తరుణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరోసారి వార్తల్లోకొచ్చాడు. అదెలా అంటే.. ఈమధ్యన పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ నటించిన అనుకోని అతిధి మూవీ లో ఫహద్ కి డబ్బింగ్ తరునే చెప్పాడట. 

ఇప్పుడు అనుకోని అతిధిలో ఫహద్ కి డబ్బింగ్ చెప్పిన తరుణ్ వాయిస్ బావుంది అని, ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా ఫహద్ ఫాజిల్ కి తరుణ్ తో డబ్బింగ్ చెప్పించాలనే ఆలోచనలో పుష్ప టీం ఉందట. మరి తరుణ్ గనక ఫహద్ కి డబ్బింగ్ చెబితే.. తరుణ్ కూడా పుష్ప లో ఓ చిన్న భాగమైనట్టే కదా.

Tarun dubs for Fahad Faasil:

Tarun Dubs For Fahadh Faasil In Pushpa?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ