ఈమధ్యన కొత్త దర్శకులు తమ ఫస్ట్ సినిమా హిట్ కాగానే నెక్స్ట్ సినిమా స్టార్ హీరోలతోనే చెయ్యాలని ఎదురు చూస్తున్నారు. ఒకసారి సూపర్ హిట్ కొట్టాక చిన్న హీరోలతో సినిమా చేసినా, చిన్న సినిమా చేసిన మళ్లీ ఆ ఫలితం ఏదైనా తేడా కొడితే మళ్లీ స్టార్ హీరోలు కనీసం వాళ్ళ కాంపౌండ్ లోకి కూడా రానివ్వరు. అందుకే సెకండ్ మూవీ ని స్టార్ హీరోలతో చెయ్యాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ లిస్ట్ బోలెడంత మంది దర్శకులు ఉన్నారు. కానీ స్టార్ హీరోలేమో పాన్ ఇండియా ఫిలిమ్స్ తో బిజీ అయ్యారు. ఓ రెండు మూడేళ్ళ వరకు వాళ్ళ డేట్స్ దొరికే పరిస్థితి లేదు.
తాజాగా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చి బాబు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎన్టీఆర్ తో మూవీ చెయ్యాలని కూర్చున్నాడు. అందుకే ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు పాన్ ఇండియా లెవల్లో లోకల్ స్టోరీ ని చూపిద్దామంటూ మెస్సేజ్ పెట్టి ఎన్టీఆర్ తో తన సినిమా కన్ఫర్మ్ అంటూ హింట్ ఇచ్చాడు. మరి ఎన్టీఆర్ చూస్తే ఆర్.ఆర్.ఆర్ అవ్వాలి అలాగే కొరటాల తో, ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అవ్వాలి. అంటే రెండు మూడేళ్లు బుచ్చి బాబుకి వెయిటింగ్ తప్పదు. అయినా బుచ్చి బాబు ఎన్టీఆర్ కోసమే వెయిట్ చేసేలానే ఉన్నాడు. మధ్యలో చిన్న సినిమా చేసి మళ్లీ అదేదన్నా అయితే ఎన్టీఆర్ తో అవకాశం పోతుంది. కాబట్టి ఉప్పెన బ్లాక్ బస్టర్ ని ఎన్టీఆర్ కోసమే ఉంచుకున్నాడు తప్పితే మరో చిన్న సినిమా గాని, యంగ్ హీరోతో సినిమా చేసే ఆలోచనలో అయితే కనిపించడం లేదు.