Advertisementt

సమంత కి మళ్ళీ స్టార్ట్ అయ్యింది

Wed 02nd Jun 2021 06:46 PM
familyman2againsttamils,shameonyousamantha,hash tags,twitter,trending,samantha akkineni,the family man 2,family man web series,amazon prime  సమంత కి మళ్ళీ స్టార్ట్ అయ్యింది
ShameonYouSamantha hashtag on Twitter సమంత కి మళ్ళీ స్టార్ట్ అయ్యింది
Advertisement
Ads by CJ

సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ మరొక్క రోజులో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఎన్ని రోజులాగానో ఎదురు చూస్తున్న ద ఫ్యామిలీ మ్యాన్ రాక ని అందరూ పట్టరాని ఆనందంతో స్వాగతిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ సూపర్ హిట్ అవడంతో సీజన్ 2 ని ఎంతో భారీగా, ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించారు. అందులోనూ సీజన్ 2 లో సౌత్ బ్యూటీ సమంత నటించడం, ఫస్ట్ టైం సమంత నెగెటివ్ కేరెక్టర్ లో టెర్రరిస్ట్ పాత్రలో కనిపించడం అన్ని సౌత్ ప్రేక్షకులని ఈ సీరీస్ కోసం ఎదురు చూసేలా చేసాయి. మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. 

అయితే అంచనాలకు మించి ఇప్పుడు ఫామిలీ మ్యాన్ 2 కాంట్రవర్సీలో చిక్కుకుంది. సమంత LTT టెర్రరిస్ట్ గా తమిళులని నాశనం చేసే పాత్రలో నటించడాన్ని తమిళులు ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ చూసినప్పటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా రాజ్ అండ్ డీకే  లు తమిళ వ్యతిరేకతపై స్పందించారు. కాకపోతే సమంత మాత్రం తన పాత్ర పై వస్తున్న ట్రోల్స్ ని లెక్క చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. అయితే అటు తమిళ్ లోను టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఫ్యామిలీ మ్యాన్ లో టెర్రరిస్ట్ గా తమిళుల మీద దాడి చేసే అమ్మాయిలా ఎలా నటించింది. ఇది తమిళ మనోభావాలకు సంబంధించింది అంటూ సమంత ని ఆడుకుంటున్నారు. 

అందుకే నిన్నటివరకు #HateSamantha, #FamilyMan2AgainstTamils హాష్ టాగ్ ని ట్రెండ్ చేసిన వారు ఇప్పుడు #ShameonYouSamantha హాష్ టాగ్ తో రెచ్చిపోతున్నారు. సమంత ఫోటో ని పెట్టి మరీ #ShameonYouSamantha హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో తమిళులు తీవ్ర అలజడి సృష్టిస్తున్నారు. రేపు విడుదల కాబోయే ఫ్యామిలీ మ్యాన్ 2 ని ఆపి తీరాలంటూ వారు ట్వీట్స్ చేస్తున్నారు.

ShameonYouSamantha hashtag on Twitter:

ShameonYouSamantha hashtag trend on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ