Advertisementt

రామ్ కి విలన్ గా తమిళ్ హీరో

Thu 03rd Jun 2021 03:19 PM
madhavan,playing a villain,ram movie,rapo19,ram - madhavan combo  రామ్ కి విలన్ గా తమిళ్ హీరో
Naga Chaitanya villain for RAPO19 రామ్ కి విలన్ గా తమిళ్ హీరో
Advertisement
Ads by CJ

హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో తెలుగు, తమిళ్ లో బైలింగువల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాగా.. సెకండ్ షెడ్యూల్ కి సెకండ్ వేవ్ కరోనా అడ్డుపడింది. దానితో షూటింగ్ ఆగింది. ఈ సినిమాలో రామ్ సరసన సూపర్ హిట్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుంది. రెడ్ తర్వాత రామ్ కి కంపల్సరీ హిట్ కావాలి. కాబట్టి కసితో రామ్ ఈ సినిమా చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా, రాయలసీమ భాష మాట్లాడే కుర్రాడిగా కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా రామ్ కి విలన్ గా తమిళ్ హీరో మాధవన్ కనిపించబోతున్నాడట. 

బ్రీత్ వెబ్ సీరీస్, నిశ్శబ్దం మూవీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ లో మెప్పించిన మాధవన్ అయితే రామ్ కి పర్ఫెక్ట్ విలన్, అలాగే మాధవన్ కి తెలుగు, తమిళ్ లోనూ బోలెడంత క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమా కోసం మాధవన్ ని సంప్రదించబోతున్నారని తెలుస్తుంది. గతంలో మాధవన్ నాగ చైతన్య సినిమా సవ్యసాచిలోనూ స్టైలిష్ విలన్ కేరెక్టర్ చేసాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా మాధవన్ బాగా ఆకట్టుకున్నాడు. సో ఫైనల్ గా మాధవన్ రామ్ విలన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Naga Chaitanya villain for RAPO19:

Madhavan Playing a Villain Role in Ram Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ