Advertisementt

ఇక్కడ శృతి నెంబర్1.. అక్కడ సమంత నెంబర్1

Thu 03rd Jun 2021 06:11 PM
shruti haasan,hyderabad times,most desirable woman 2020,samantha akkineni,channai times,most desirable woman 2020  ఇక్కడ శృతి నెంబర్1.. అక్కడ సమంత నెంబర్1
Hyderabad Times Most Desirable Woman 2020: Shruti Haasan ఇక్కడ శృతి నెంబర్1.. అక్కడ సమంత నెంబర్1
Advertisement
Ads by CJ

ప్రతి ఏడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు కు చెందిన హైదరాబాద్ టైమ్స్ విభాగం మోస్ట్ డిజైరబుల్ మెన్ అలాగే మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుదల చెయ్యడం చూస్తున్నాం. 2020 మోస్ట్ డిజైరబుల్ మెన్ గా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. 2020 మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా కోలీవుడ్ నటి శృతి హాసన్ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మరింది. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు మంచి హిట్స్ దక్కించుకుంది. 

ఇక గత ఏడాది మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టాలీవుడ్ నటి సమంత అక్కినేని ఈసారి సెకండ్ ప్లేస్ లోకి రావడం అక్కినేని అభిమానులకి షాకిచ్చింది. అయితే సమంత హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా సెకండ్ ప్లేస్ లో నిలిస్తే.. అక్కడ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2020 లో టాప్ లో నిలిచి ఫాన్స్ మనసు గెలుచుకుంది. ఇక మూడో స్థానంలో ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న పూజ హెగ్డే, నాలుగో స్థానంలో ప్రస్తుతం ప్లాప్స్ తో వెనకబడిన ఫిట్ నెస్ లో నెంబర్ వన్ లో ఉన్న రకుల్ ప్రీత్ గెలుచుకోగా.. ఐదో ప్లేస్ లో టాలీవుడ్ నెంబర్ 2 రష్మిక మందన్న నిలిచింది. 

సో మోస్ట్ డిజరబుల్ ఉమెన్స్ గా నెంబర్ వన్ లో శృతి హాసన్, నెంబర్ 2 లో సమంత, నెంబర్ 3 లో పూజ హెగ్డే, నెంబర్ 4 రకుల్, నెంబర్ 5 లో రశ్మికలు ఉన్నారు.

Hyderabad Times Most Desirable Woman 2020: Shruti Haasan:

Shruti Haasan Is Hyderabad Times Most Desirable Woman 2020

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ