Advertisementt

అల్లు అర్జుజ్ తగ్గేలా లేడు

Fri 04th Jun 2021 06:03 PM
allu arjun,sukumar,allu arjun - sukku combo,pushpa pan india movie,pushpa teaser crosses 70 million views  అల్లు అర్జుజ్ తగ్గేలా లేడు
Allu Arjun Creates All-Time Record With Pushpa అల్లు అర్జుజ్ తగ్గేలా లేడు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో పుష్ప పాన్ ఇండియా మూవీ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరి పుష్ప అప్ డేట్స్ చూస్తే అంచనాలు పెరక్కుండా ఎలా ఉంటాయి. పుష్ప రెండు పార్ట్ లుగా రిలీజ్ అవుతుంది అనగానే అందరూ పుష్ప ని బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటున్నారు. పార్ట్ 1 నుండి పార్ట్ 2 వరకు ఎలాంటి క్యూరియాసిటీ కలిగిస్తుందో బన్నీ - సుక్కు జంట అంటూ ఆరాలు మొదలు పెట్టారు. ఇక పుష్ప నుండి విడుదలైన టీజర్ ఇప్పటికి యూట్యూబ్ రికార్డులని వేటాడుతూ.. తగ్గేదే లే అంటుంది. అల్లు అర్జున్ తగ్గేదే లే.. తగ్గేదే లే.. అంటూ మాటమాటాకి ఎందుకంటున్నాడో పుష్ప టీజర్ వ్యూస్ చూస్తే తెలుస్తుంది.

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పుష్ప  టీజర్ భారీ స్థాయి రికార్డులు యూట్యూబ్ లో సెట్ చేస్తుంది. ఇప్పడు పుష్ప టీజర్ ఏకంగా మొట్టమొదటి 70 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి మిగతా హీరోలకు సవాల్ చేస్తుంది. అల్లు అర్జున్ ఫాన్స్ అల్లు అర్జున్ పుష్ప ని అందనంత ఎత్తులో నిలబెట్టాలని కంకణం కట్టుకుని మరీ ఇలా సోషల్ మీడియా రచ్చకు తెర లేపారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ హీరోగా అల్లు అర్జున్ పుష్ప టీజర్ తో రికార్డులని సృష్టించాడు. అసలు ఈలెక్క ఇంకెక్కడ ఆగుతుందో.. ఇంకెన్ని రికార్డులకు నెలవుగా మారుతుందో అంటున్నారు ఆయన ఫాన్స్.

Allu Arjun Creates All-Time Record With Pushpa:

Allu Arjun Pushpa crosses 70 million views

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ