Advertisementt

రాజి అంటే సాఫ్ట్ అనుకునేరు

Fri 04th Jun 2021 08:08 PM
samantha akkineni,family man 2 web series,raji role,negative sheds,samantha fans. akkineni fans  రాజి అంటే సాఫ్ట్ అనుకునేరు
The Family Man 2: Samantha amazing performance రాజి అంటే సాఫ్ట్ అనుకునేరు
Advertisement
Ads by CJ

సమంత అక్కినేని గ్లామర్ గా డ్రెస్ వేసుకుని, నీట్ గా జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తూ, స్టయిల్ గా యోగ చేసే అమ్మాయి అనుకుంటున్నారా.. ఒక్కసారి సమంత పోషించిన ఫ్యామిలీ మ్యాన్ రాజి పాత్ర చూడండి. సమంత అంటే ఇలా కూడా ఉంటుందా అంటారు. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత నెగెటివ్ రోల్, టెర్రరిస్ట్ రోల్ పోషిస్తుంది అంటూ ప్రచారం జరగడం, ఇంత అందమైన అమ్మాయి నెగెటివ్ గా టెర్రరిస్ట్ రోలా అనుకున్నారు. నెగెటివ్ గా అంటే అలాంటి యిలాంటి నెగెటివ్ కాదండోయ్.. రాజి పాత్రలో మనుషులని ముక్కలు ముక్కలు చేసేంత కసి గల అమ్మాయిగా సమంత ఫ్యామిలీ మ్యాన్ లో కనిపించింది.

శ్రీలంక లో ఓ స్కూల్ హెడ్ మాస్టర్ గారి అమ్మాయి ఇంత కర్కశంగా ఎందుకు మారిందో, అలా స్లీపర్ సెల్ గా ఉంటూ తన చీఫ్ చెప్పిన టైం కి ఆపరేషన్ లోకి ఎలా దిగిందో.. మనోజ్ బజ్ పేయీ తో ఎలా కొట్లాడిందో, తనని ఏడిపించే వారికి చావు ఎలా ఉంటుందో చూపించి, అమ్మాయి అయినా కళ్ళలో కసి, మోహంలో అమాయకత్వం, చేసే పనిలో డెడికేషన్ ఇవన్నీ రాజి పాత్ర సొంతం. డైలాగ్ డెలివరీ, రాజీగా సమంత లుక్స్, జిడ్డు కారుతున్న పేస్ తో శత్రువులని మట్టుబెట్టడం అమ్మో అందమైన సమంతని చాలా భయంకరంగా ఈ సీరీస్ లో చూపించారు. బికినీ షోలతో, బ్యూటిఫుల్ డ్రెస్సులతో గ్లామర్ గా కళకళలాడే సమంత.. రాజిగా జిడ్డు ఫేస్ తో అద్భుతమైన పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 చాలామంది సమంతకోసమే చూస్తున్నారంటే అతిశయోక్తి లేదు.

The Family Man 2: Samantha amazing performance:

Fans loving Samantha Performance in Family Man 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ