Advertisementt

బాయ్ కాట్ అమెజాన్

Sun 06th Jun 2021 12:33 PM
boycottamazon,familyman2_against_tamils,chellamsir,trends on twitter  బాయ్ కాట్ అమెజాన్
Boycott Amazon trends on Twitter బాయ్ కాట్ అమెజాన్
Advertisement
Ads by CJ

గత మూడురోజులుగా సైలెంట్ గా ఉన్న తమిళ తంబీలు పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ ని వీక్షించి మరోసారి ఫ్యామిలీ మ్యాన్ పై కక్ష సాధిస్తున్నారు. మనోజ్ బజ్ పేయీ.. సమంత కీలక పాత్రల్లో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ 2 అమెజాన్ ప్రైమ్ లో జూన్ 3 రాత్రి నుండి అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ చూసిన తర్వాత తమిళ తంబీలు ఫ్యామిలీ మ్యాన్ పై నిప్పులు చెరిగారు. #FamilyMan2_against_Tamils, #ShameonSamantha అంటూ ఈ సీరీస్ లో రాజి కేరెక్టర్ చేసిన సమంత ని తమిళ తంబీలు చాలా హేట్ చేసారు. ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ ని అడ్డుకోవాలంటూ నానా హంగామా చేసారు. అయినా అనుకున్న టైం కన్నా ముందే ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. 

అప్పటినుండి ఈ రోజు వరకు ఫ్యామిలీ మ్యాన్ పై తమిళులు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. కానీ ఇప్పుడు మరోసారి తమిళియన్స్ ఫ్యామిలీ మ్యాన్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. LTT చీఫ్ ప్రభాకరన్ శ్రీలంక రెబల్స్ తో ఇండియా ప్రధాని మీద దాడి కి యత్నించడం, దాని కోసం టెర్రరిస్ట్ ల సహాయం తీసుకోవడం, దేశ ప్రధానిని చంపేసే వెపన్ గా రాజి గా సమంత నటించడం లాంటి విషయాలను తమిళియన్స్ తేలిగ్గా తీసుకోవడం లేదు. అక్కడికి రాజి పాత్ర కల్పితం అని సమంత చెప్పినా వారు వినడం లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ వలన తమ చరిత్రకి భంగం వాటిల్లుతుంది అంటూ పెద్ద ఎత్తున #BoycottAmazon  #FamilyMan2_against_Tamils #ChellamSir అనే హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

చెల్లం సర్ అనే అతను శ్రీకాంత్ తివారి కి శ్రీలంక LTT చీఫ్ గురించి, ఇంకా చాల విషయాలను కనిపెట్టడానికి ఉప్పందిస్తూ ఉంటాడు. చెల్లం సర్ వలనే శ్రీకాంత్ తివారి టీం రాజి ని, ఆమె మిషన్ ని ఛేదించగలిగింది. సో ఇప్పుడు తమిళులు ఈ రోజు ఉదయం నుండి #BoycottAmazon  #FamilyMan2_against_Tamils #ChellamSir  హాష్ టాగ్స్ తో ట్విట్టర్ ని ఊపేస్తున్నారు. 

Boycott Amazon trends on Twitter:

#BoycottAmazon #FamilyMan2_against_Tamils #ChellamSir trends on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ