Advertisementt

ఎల్లుండి మీటింగ్.. అప్పుడే నిర్ణయం

Sun 06th Jun 2021 01:32 PM
cm kcr,telangana state,cm kcr meeting,state cabinet meeting,june 8,corona,covid 19,lock down  ఎల్లుండి మీటింగ్.. అప్పుడే నిర్ణయం
CM KCR to hold State Cabinet meeting on June 8 ఎల్లుండి మీటింగ్.. అప్పుడే నిర్ణయం
Advertisement
Ads by CJ

తెలంగాణాలో మే 11 నుండి లాక్ డౌన్ నడుస్తుంది. ఏప్రిల్ 20 నుండే తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండగా.. మే 11 నుండి పూర్తి లాక్ డౌన్ పెట్టి కేవలం నాలుగు గంటల సడలింపులు ఇవ్వడంతో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇక మే 21 వరకు మొదటి విడత లాక్ డౌన్ తర్వాత మే ముప్పై వరకు ఆ తర్వాత జూన్ 9 వరకు పొడిగిస్తూ పోయింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గి హాస్పిటల్ లో హడావిడి తగ్గింది. దానితో జూన్ 9 తర్వాత మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తారా లేదంటే లాక్ డౌన్ ఎత్తేసి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారా అనే విషయంపై ప్రభుత్వం ఎల్లుండి నిర్ణయం తీసుకోబోతుంది. 

జూన్ 8 న మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేసీఆర్ ఈ కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌ లేదంటే పొడిగింపు ఇంకా కరోనా పరిస్థితులు, వైర‌స్ క‌ట్ట‌డికి శాఖల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు పై చరించబోతున్నట్టుగా తెలుస్తుంది. లాక్ డౌన్ ఎత్తేసి కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మూడోద‌శ విజృంభ‌ణ‌కు స‌న్న‌ద్ధం అయ్యేలా ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది. మరి జూన్ 9 తర్వాత తెలంగాణాలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అనేది జూన్ 8 నే క్లారిటీ ఇచ్చేస్తారు.

CM KCR to hold State Cabinet meeting on June 8:

Telangana Cabinet Meeting Will Be Held On June 8th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ