Advertisementt

ఈసారి కామెడీ కాదు.. పిసినారిగా

Thu 10th Jun 2021 09:41 AM
f3,anil ravipudi,venkatesh,f3 movie,varun tej,venky - varun combo f3  ఈసారి కామెడీ కాదు.. పిసినారిగా
F3 Shooting update ఈసారి కామెడీ కాదు.. పిసినారిగా
Advertisement
Ads by CJ

అది సంక్రాతి టైం.. బడా హీరోలు యాక్షన్ సినిమాలతో పోటీ పడి ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి బాక్సాఫీసు కాసులని సొమ్ము చేసుకునే సమయంలో కామెడీ ఎంటర్టైనర్ అంటూ వెంకీ - వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాని ఎంతో డేర్ గా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. స్టార్ హీరోల సినిమాల సంగతి ఎలా ఉన్న ఎఫ్ 2 సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ తోడల్లుళ్ళుగా.. తమన్నా, మెహ్రీన్ లు అక్క చెల్లెళ్లుగా, రాజేంద్ర ప్రసాద్ నైబర్ గా చేసిన కామెడీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ గా వెంకీ - వరుణ్ - రాజేంద్ర ప్రసాద్ కాంబోలో ఎఫ్ 3 చేస్తున్నాడు.

అయితే ఎఫ్ 2 లో కామెడీతో రెచ్చిపోయిన రాజేంద్ర ప్రసాద్ కేరెక్టర్ ని ఈసారి మహా పిసినారిగా అంటే.. అహ నా పెళ్ళంటా మూవీలో కోట శ్రీనివాస్ కున్న అతి పిసినారి తనాన్ని ఎఫ్ 3 లో రాజేంద్ర ప్రసాద్ తో చేయిస్తే ఎలా ఉంటుంది అని అనిల్ రావిపూడి రాజేంద్ర ప్రసాద్ కేరెక్టర్ కి అలాంటి పిసినారి టచ్ ఇస్తున్నాడట. ఎలాగూ సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరిగే కామెడీ కాబట్టి.. రాజేంద్ర ప్రసాద్ కేరెక్టర్ ని ఇలా చూపించబోతున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి.. సెకండ్ వేవ్ తో ఆగిన ఎఫ్ 3 షూటింగ్ కొత్త షెడ్యూల్ సారధి స్టూడియో లో వేసే స్పెషల్ సెట్ లో త్వరలోనే మొదలు కాబోతుందట.

F3 Shooting update :

Venky - Varun tej F3 Shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ