Advertisementt

షర్మిల పార్టీ అదే

Mon 07th Jun 2021 03:11 PM
ys sharmila,ysr tp party,july 8,occasion,ysr birthday  షర్మిల పార్టీ అదే
YS Sharmila to announce party name on YSR Jayanthi షర్మిల పార్టీ అదే
Advertisement
Ads by CJ

మాజీ సీఎం, లేటు సీఎం రాజశేఖర్ కొడుకు జగన్ ఏపీ సీఎం గా వైసిపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. తండ్రి మరణం తర్వాత అన్న జగన్ కి సహాయం చేసిన చెల్లి షర్మిల.. జగన్ ప్రభుత్వం పరిపాలన మొదలు పెట్టాక రాజకీయాలకు దూరమైంది. అన్న జగన్ అంటే నచ్చకో, ఆయన పాలనా నచ్చలేదో, అన్న చెల్లళ్ళకి పొసగలేదో వైసిపి ప్రభుత్వం వచ్చాక షర్మిల కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి తెలంగాణాలో పార్టీ అంటూ షర్మిల రాజకీయాలు మొదలు పెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీ అంటే ఢీ అంటుంది. కాంగ్రెస్ నాయకులూ, రాజశేఖర్ రెడ్డి మిత్రులు, ఆయన భక్తులు అందరూ షర్మిల వెంట నడవడానికి రెడీ అవుతున్నారు. ఇక జగన్ ఆశీస్సులు ఉన్నాయని షర్మిల ప్రకటించింది. కానీ జగన్ ఇంతవరకు షర్మిల్ పార్టీపై పెదవి విప్పలేదు.

గత రెండు నెలలుగా తెలంగాణాలో షర్మిల ఉనికి కాపాడుకోవడానికి, నిరాహార దీక్షలు, ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ అంటూ హడావిడి చేస్తుంది. ఇక షర్మిల తెలంగాణాలో పెట్టబోయే పార్టీ పేరు వైఎస్సార్ టీపీ  గా ప్రచారం లో ఉంది. ఇప్పుడు అదే పేరుని రిజిస్టర్ చేయించారు. అంటే షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎస్సార్ టీపీ అన్నమాట. రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. వైఎస్సార్ అనుకున్నట్లుగా తెలంగాణాలో సంక్షేమ పాలనను మళ్లీ తీసుకు వ‌స్తామ‌ని చెప్పుకొచ్చారు. రాజ‌న్న ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్న‌ట్లు చెప్పారు.

YS Sharmila to announce party name on YSR Jayanthi:

YS Sharmila To Launch Her YSR TP Party On July 8 On Occasion Of YSR Birthday 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ