మరో మూడు రోజుల్లో బాలకృష్ణ బర్త్ డే. జూన్ 10 న బాలయ్య ఫాన్స్ కి పండగ రోజు, గత ఏడాది బాలయ్య పుట్టిన రోజు నాడు BB3 టీజర్ రిలీజ్ చేసిన బోయపాటి ఈసారి అదే అఖండ నుండి సింగిల్ రిలీజ్ చేయబోతున్నారనే టాక్ ఉండడమే కాదు.. బాలకృష్ణ తో కమిట్ అయిన గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిల సినిమాలు అధికారిక ప్రకటనలు ఉండబోతున్నాయంటూ ప్రచారం జరిగుతోంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ టైం లో పుట్టిన రోజు చేసుకోవడం కరెక్ట్ కాదని.. అందుకే ఫాన్స్ తన పుట్టిన రోజు ని ఎలాంటి హడావిడి చెయ్యొద్దు అని బాలయ్య లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
నా ప్రాణ సమానులైన అభిమానులకు ..
ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..
నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి
సర్వదా విధేయుడ్ని ..
కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..
నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం
..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..
మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు
మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు
మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక ..
దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ ..
ఈ విపత్కాలంలో అసువులు బాసిన
నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..
మీ నందమూరి బాలకృష్ణ ..