Advertisementt

అతనికి స్పెషల్ థాంక్స్ అంటున్న సమంత

Mon 07th Jun 2021 06:25 PM
samantha akkineni,family man 2,samantha thanks,stunt director,the family man 2  అతనికి స్పెషల్ థాంక్స్ అంటున్న సమంత
Samantha thanks her stunt choreographer in The Family Man 2 అతనికి స్పెషల్ థాంక్స్ అంటున్న సమంత
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత రాజీ పాత్రలో చాలా అమాయకమైన అమ్మాయిగా, ఎటువంటి ఎక్సప్రెషన్ కనిపించకుండా.. తనని అల్లరి చేసినవాడిని చేతులు కళ్ళు ఇరగదీసి చంపెయ్యడమే కాదు.. తన యజమాని తనని తిట్టిన కారణముగా అతన్ని చంపేసి బాడీ ని ముక్కలు ముక్కలుగా చేసి పారెయ్యడం, అలాగే గన్ పేల్చడం, TASK అధికారులపై దాడికి దిగడం, ఇలా చాలా యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసింది. హీరోలకి తీసిపోని యాక్షన్ తో సమంత అద్భుతంగా కనిపించింది. ఆ యాక్షన్ సీన్స్ లో సమంత పడిన కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా రిలీజ్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ మేకింగ్ లో సమంత పోరాట సన్నివేశల కోసం ఒళ్ళు ఎలా హూనం చేసుకుందో తెలుస్తుంది.

ఒకే ఎమోషన్ తో తమిళదేశం కోసం ఈలం పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మందికి ప్రతిరూపంగా.. అన్యాయానికి గురైన మహిళకు చిహ్నంగా సమంత రాజీ పాత్రలో నటించలేదు.. జీవించింది. సమంత అంత చక్కగా యాక్షన్ సీన్స్ చెయ్యడానికి, అవి అంత అద్భుతంగా రావడానికి కారణం యానిక్ బెన్ అనే యాక్షన్ కొరియోగ్రఫర్ అని చెబుతుంది సమంత. ఫ్యామిలీ మ్యాన్ లో యాక్షన్ సీక్వెన్స్ అంత బాగా చేసేందుకు నాకు ఎంతో సహాయపడిన, శిక్షణ ఇచ్చిన యానిక్ బెన్‌కు స్పెషల్ థ్యాంక్స్. ఆ సీన్స్ చేసేటప్పుడు నా శరీరంలోని ప్రతీ భాగం నొప్పి పుట్టినా కూడా నా వెన్నంటే ఉండి చూసుకున్నావ్.. నా పెయిన్ కిల్లర్‌వి అయ్యావ్.. 

నాకు మామూలుగా హైట్స్ అంటే భయం. కానీ ఎలాంటి భయం లేకుండా ఆ జంప్‌లు చేశానంటే.. నువ్ నా వెనుకున్నావ్ అనే ధైర్యంతోనే. థ్యాంక్యూ అంటూ యాక్షన్ డైరెక్టర్ మీద ప్రశంసలు కురిపించింది సమంత.

Samantha thanks her stunt choreographer in The Family Man 2:

Samantha thanks stunt director in The Family Man 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ