Advertisementt

బిగ్ బాస్ కి బిగ్ బాస్ కష్టాలు

Mon 07th Jun 2021 10:09 PM
bigg boss telugu season 5,bigg boss,begin in july  బిగ్ బాస్ కి బిగ్ బాస్ కష్టాలు
Bigg Boss 5: upadte బిగ్ బాస్ కి బిగ్ బాస్ కష్టాలు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 జులై నుండి మొదలు కాబోతుంది అనగానే.. అందులో పాల్గొనబోయే 15 మంది కంటెస్టెంట్స్ పై సోషల్ మీడియా ఫోకస్ పెట్టేసింది. అంటే ఈ సెలెబ్రిటీ అందులో పాల్గొంటున్నారు.. ఆ సెలెబ్రిటీ బిగ్ బాస్ కి వెళుతున్నారంటూ హంగామా షురూ చేసారు. జులై సెకండ్ వీక్ నుండి స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుంది అనే న్యూస్ నడుస్తుంది. ఇప్పటికే 30 మంది లిస్ట్ స్టార్ మా చేతిలో ఉంది అంటూ.. ఆ 30 మందితో జూమ్ ఇంటర్వూస్ నిర్వహిస్తూ 15 మందిని సెలక్ట్ చేస్తారంటూ ప్రచారం మొదలైంది. అయితే కాస్త పేరున్న సెలబ్రిటీస్ కోసం స్టార్ మా ఈసారి కూడా ప్రయత్నం చేస్తుందట.

కానీ స్టార్ మా ప్రయత్నాలు వర్కౌట్ అవ్వడం లేదట, కాస్త ఫెడవుట్ అయిన హీరోయిన్స్ అయినా తమ షో కి క్రేజ్ వస్తుంది అనుకుంటే.. వాళ్ళు మాత్రం ససేమిరా అంటున్నారట. సీజన్ వన్ నుండి స్టార్ మా మాజీ హీరోయిన్స్ విషయంలో గట్టి ప్రయత్నాలే చేస్తుంది. కానీ ఎవరూ బిగ్ బాస్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. బిగ్ బాస్ మొదలవుతుంది అన్న టైం కి చాలామంది సెలబ్రిటీస్ పేర్లు వినిపించినా చివరికి హౌస్ లోకి అడుగుపెట్టేవారిని చూస్తే అబ్బా వీళ్లా అంటూ చాలామంది బుల్లితెర ప్రేక్షకులు డిస్పాయింట్ అవుతున్నారు. ఇక తాజాగా సీజన్ కి అయితే కొద్దిగా పేరున్న సెలబ్రిటీస్ కూడా వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని వినికిడి. 

ఎందుకంటే ఓ 100 రోజులు అలాగే, 14 డేస్ క్వారంటైన్ అంటూ పర్సనల్ లైఫ్ కి, కెరీర్ కి దూరమవడమే అందుకే బిగ్ బాస్ కి రావడానికి అంతగా మక్కువ చూపడం లేదట. మరి బిగ్ బాస్ కే బిగ్ బాస్ కష్టాలు అన్నట్టుగా లేదూ ఈ వ్యవహారం. 

Bigg Boss 5: upadte:

Bigg Boss Telugu Season 5 to begin in July?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ