ఈమధ్యన ఎన్టీఆర్ తన సినిమాలకి అన్నయ్య కళ్యాణ్ రామ్ ని నిర్మాణ భాగస్వామిగా చేస్తున్నాడు. జై లవ కుశ సినిమా కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే చేసిన ఎన్టీఆర్ ఈమధ్యన తాను నటించబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కి కూడా కళ్యాణ్ రామ్ ని ఇతర నిర్మాతలతో భాగస్వామిగా చేస్తూ అన్నకి సాయపడుతున్నాడు. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే బింబిసార టైటిల్ అండ్ లుక్ ని వదిలింది టీం.
అయితే కళ్యాణ్ రామ్ బింబిసార కి ఎన్టీఆర్ కి కనెక్షన్ అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఎన్టీఆర్.. అన్న బింబిసార కి మాట సాయం చేస్తున్నాడట. ఎలా అంటే. బింబిసార లో అత్యంత కీలకమైన కథను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. కళ్యాణ్ రామ్ తాను హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ్ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ సోషియో ఫాంటసీగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో చారిత్రక అంశాలతో బింబిసార తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మర్కెట్ అంటే అందులో ఎన్టీఆర్ కూడా మాట సాయం అంటే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం.