Advertisementt

మహేష్, దేవరకొండతో సినిమాలు చేస్తారట

Tue 08th Jun 2021 05:50 PM
raj and dk,mahesh babu and vijay devarakonda,family man 2,mahesh babu,vijay devarakonda  మహేష్, దేవరకొండతో సినిమాలు చేస్తారట
Raj-DK to direct Mahesh Babu and Vijay Devarakonda? మహేష్, దేవరకొండతో సినిమాలు చేస్తారట
Advertisement
Ads by CJ

ఫామిలీ మాన్ వెబ్ సీరీస్ తో దుమ్మురేపిన బాలీవుడ్ ద్వయం రాజ్ అండ్ డీకే లు మన తెలుగు వాళ్ళే అన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఈ ఇద్దరు తిరుపతి యూనివర్సిటీలో కలిసి చదువుకుని అమెరికా పై చదువుల కోసం వెళ్లి అక్కడ సినిమాలపై ఇష్టం తో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. పేరు సంపాదించి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. కొన్నాళ్లుగా అవకాశాల కోసం తిరిగి మెల్లిగా బాలీవుడ్ డైరెక్టర్స్ గా జెండా పాతిన రాజ్ అండ్ డీకే డిజిటల్ ప్రపంచంలో ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ తో అద్భుతాలు సృష్టించారు. తెలుగు వారైన ఈ దర్శకులు పేరులోనే కాదు, కెరీర్ లోను విడదీయరాని బంధంగా మారిపోయారు. ప్రస్తుతం ఫామిలీ మాన్ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న ఈ దర్శకులు ఫ్యామిలీ మ్యాన్ లో తెలుగు వారికీ చోటిచ్చి తమ అభిరుచుని చాటుకున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ లో సందీప్ కిషన్ ని ఆర్మీ ఆఫీసర్ గా తీసుకున్న రాజ్ అండ్ డీకే ఈ సీరీస్ లో సమంత ని తీసుకుని ఆమె కేరెక్టర్ తో అద్భుతం చేసారు. అయితే ఈ దర్శకులు ఎప్పటినుండో టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నారట. ఎప్పుడో తెలుగులో చేద్దామని ఉన్నా.. హిందీలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ వలన వారు అక్కడ బిజీగా ఉన్నారట. అయితే తెలుగులో స్టార్ హీరోలైన విజయ్ దేవరకొండ, మహేష్ తో రాజ్ అండ్ డీకే వాళ్ళకి మధ్యన కథా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ తెలుగు వారు తెలుగు హీరోలతో సినిమాలు ఎపుడు చేస్తారో చూద్దాం. మహేష్ కానీ, విజయ్ కి కానీ రాజ్, డీకే వాళ్ళు సెట్ అయితే ఆ క్రేజ్, ఆ రేంజ్ వేరుగా ఉండడం మాత్రం ఖాయం.

Raj-DK to direct Mahesh Babu and Vijay Devarakonda?:

Raj and dk to collaborate with mahesh babu and vijay devarakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ