Advertisementt

సమంత ని చూసి ఫిదా అంటున్న హీరోయిన్

Tue 08th Jun 2021 06:46 PM
rakul preet singh,reviews,family man 2,samantha akkineni,manoj bajpayee  సమంత ని చూసి ఫిదా అంటున్న హీరోయిన్
Rakul Preet Singh calls Samantha Akkineni fire girl సమంత ని చూసి ఫిదా అంటున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

సమంత తాజా వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ చూసిన వారు సమంత ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గ్లామర్ హీరోయిన్ అయ్యుండి.. ఇలా డీ గ్లామర్ రోల్ లో, గట్స్ ఉన్న రోల్ లో యాక్షన్ తో ఇరగదీసిన సమంత ఫ్యామిలీ మ్యాన్ రాజి పెరఫార్మెన్స్ ని తెగ పొగిడేస్తున్నారు. విమర్శకుల ప్రసంశలు అందుకుంటున్న సమంత ని పొగుడుతూ తోటి హీరోయిన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్ట్ టైం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన సమంత ని సౌత్ ప్రేక్షకులే కాదు.. నార్త్ ప్రేక్షకులు పొగడని వారు లేరు. అలాంటి డీ గ్లామర్ రోల్ లో టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటన గురించి ఎంత మట్లాడుకున్నా తక్కువే.

తాజాగా సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ని వీక్షించిన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సమంత ని తెగ పొగిడేసింది. రకుల్ ఫ్యామిలీ మొత్తం సమంత కి ఫాన్స్ గా మారిపోయారు. రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఇప్పుడే ఫ్యామిలీ మ్యాన్ 2 చూసాను. ఫ్యామిలీ మ్యాన్ లో నటించిన వారంతా చాలా అద్భుతంగా చేసారు. మనోజ్‌బాజ్‌పాయ్‌ని పొగడాలంటే మాటలు సరిపోవడం లేదు. ఇక సమంత.. నీకు హ్యాట్సాఫ్‌.. రాజి పాత్రలో నీ పెరఫార్మన్స్ అద్భుతం. మా ఫ్యామిలీ మెంబెర్స్ నాతో పాటుగా అంతా నీ అభిమానులుగా మారిపోయారు.. దర్శకులు రాజ్ అండ్ డీకే లకి ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేసింది. మరి సమంత ని రకుల్ ఆ రెంజ్ లో పొగిడేసిందన్నమాట.

Rakul Preet Singh calls Samantha Akkineni fire girl:

Rakul Preet Singh reviews Samantha Akkineni and Manoj Bajpayee

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ