Advertisementt

సుప్రీం కోర్టుకి వెళ్తా అంటున్న నటి, ఎంపీ

Tue 08th Jun 2021 06:58 PM
navneet kaur,mp navneet kaur,supreme court  సుప్రీం కోర్టుకి వెళ్తా అంటున్న నటి, ఎంపీ
Amravati MP Navneet Kaur Controversy సుప్రీం కోర్టుకి వెళ్తా అంటున్న నటి, ఎంపీ
Advertisement
Ads by CJ

నటి, ఎంపీ నవనీత్ కౌర్ ఎంపీ గా మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచింది. అప్పటినుండి పార్లమెంట్ లో తన గళం వినిపిస్తుంది ఆమె. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను ప్రేమ వివాహం చేసుకున్న నవనీత్ కౌర్ అమరావతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడంతో..  శివసేన అభ్యర్థి ఒకరు ఆమె గెలుపుపై, ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ పై కోర్టులో పిటిషన్ వేశారు. దానితో బాంబే హై కోర్టు నవనీత్ క్యాస్ట్ పై విచారణ చేపట్టి ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ తో మోసం చేసింది అని.. కోర్టు విచారణలో ఆమె ఎస్సీ కాదని తేల్చింది. 

దానితో ఇప్పుడు ఆమె ఎంపీ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉండగా.. బాంబే హై కోర్టు తీర్పు పై నవనీత్ కౌర్ తాజాగా స్పందించింది.  ఓ ఇండియన్ గా తాను కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని వెల్లడించారు. అయితే, బాంబే హై కోర్టు తీర్పు ని సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపింది. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని నవనీత్ కౌర్ స్పష్టం చేసింది. 

Amravati MP Navneet Kaur Controversy :

Navneet kaur says She will approach Supreme court

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ