Advertisementt

గాలివానలా మారిన ఫ్యామిలీ మ్యాన్ వివాదం

Tue 08th Jun 2021 08:24 PM
the family man 2,new controversy,tamil,samantha character raji,manoj bajpayee,srikanth tiwari  గాలివానలా మారిన ఫ్యామిలీ మ్యాన్ వివాదం
The Family Man 2 lands into a new controversy గాలివానలా మారిన ఫ్యామిలీ మ్యాన్ వివాదం
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ మ్యాన్ జూన్3 న రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ తో అమెజాన్ ప్రైమ్ లో దూసుకుపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కి బ్రహ్మరథం పడుతున్నారు. కానీ తమిళియన్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ ని ఆపేయాలని, స్ట్రీమింగ్ ని తక్షణమే ఆపేయాలని నానా యాగీ చేస్తున్నారు. తమిళ చరిత్ర గురించి ఫ్యామిలీ మ్యాన్ దర్శకనిర్మాతలకు ఏం తెలుసని ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ దగ్గర నుండి మొదలైన వివాదం.. రిలీజ్ అయ్యాక మళ్ళీ మూడు రోజులకి ఆ వివాదం మరింతగా రాజుకుంది. 

తమిళియన్స్ ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్ ఆపేయ్యాలంటూ గొడవ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వివాదంలో కాలు పెట్టని సెలబ్రిటీస్ ఇప్పడు గొంతెత్తుతున్నారు. ఈలం చరిత్రకి, ఐఎస్ఐ కి లింక్ ఎలా పెడతారు.. తమిళ చరిత్ర ఏం తెలుసు అని ఫ్యామిలీ మ్యాన్ ని తెరకెక్కించారు.. అంటూ కోలీవుడ్ పెద్ద భరతి రాజా స్పందించారు. తక్షణమే ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్ ఆపేయ్యాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వివాదం చిలికి చిలికి గాలివాన మారింది. 

The Family Man 2 lands into a new controversy:

The deep Tamil cultural connection makes The Family Man 2 more appealing and global

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ