బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ మూవీ నుండి బాలయ్య బర్త్ డే కానుకగా ఒక రోజు ముందే అంటే ఈ రోజు సాయంత్రమే అఖండ స్పెషల్ పోస్టర్ రాబోతుంది. ప్రస్తుతం బాలయ్య ఫాన్స్ బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం వెయిటింగ్. బాలయ్య ఫాన్స్ ని ఎలాంటి హడావిడి చెయ్యొద్దు అంటూ లేఖ రాయడంతో కాస్త డిస్పాయింట్ అయినా సోషల్ మీడియాలో బాలయ్య స్టామినా చూపెట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే బాలకృష్ణ నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని తో చేస్తున్నాడు. ఆ సినిమా కి సంబందించిన అప్ డేట్ ఉంటుంది అని ఆశపడుతున్నారు.
అయితే గోపీచంద్ బాలయ్య కోసం ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడట. అఖండ షూటింగ్ పూర్తి కాగానే తన సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ కోసం ఓ అదిరిపోయే లేడీ విలన్ కేరెక్టర్ ని రాసుకున్నాడట. ఆ పాత్ర కోసం తనకి అచ్చొచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ నే తీసుకోబోతున్నాడట, క్రాక్ మూవీలో వరలక్ష్మి ని పవర్ ఫుల్ గెటప్ లో చూపించినట్లుగా బాలయ్య కోసం ఈసారి వరలక్ష్మి విలన్ పాత్రని హైలెట్ చేయబోతున్నాడట గోపీచంద్. బాలయ్య తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపిస్తుంది అని అంటున్నారు.