వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని అరెస్ట్ చేసేందుకు ఇండియన్ పోలీస్ లు శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మెహుల్ చోక్సీ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ బార్బరా నే తనని పోలీస్ లకి పట్టించింది అంటూ ఎప్పటినుండో ఆరోపిస్తున్నాడు. కానీ బార్బరా చోక్సీ నే తనని మోసం చేసాడని.. చోక్సి అరెస్ట్ కి తనకి ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. అయితే ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారంలో భారీ ట్విస్ట్ ఒకటి బయటపడింది. అది చోక్సి తనని వలలో వేసుకునేందుకు రాజ్ గా పరిచయం పెంచుకుని తనకి డైమండ్ రింగ్ అండ్ నేక్లెస్ ఇచ్చాడని చెబుతుంది.
అయితే చోక్సి పోలీస్ కేసులో ఇరుక్కున్నాక తనకి ఇచ్చిన రింగ్ అలాగే నేక్లెస్ ని టెస్ట్ చేయించగా అవి నకిలీవి అని తేలినట్లుగా బార్బరా చెబుతుంది. తనతో కలిసి వ్యాపారం చెయ్యాలని.. నేను చోక్సి ఆఫీస్ కి వచ్చా అని, ఆ ఆఫీస్ లో నన్ను ముద్దుపెట్టుకోబోయాడని అందుకే తాను అతనితో గొడవపెట్టుకున్నా అని, అతన్ని పోలీస్ లు పట్టుకోవడంలో తన ప్రమేయం లేదని.. అందరిలాగే తాను మోసపోయాను అంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.