Advertisementt

వరుణ్ తేజ్ వరస కమిట్మెంట్స్

Wed 09th Jun 2021 11:19 AM
varun tej,gani movie,f3 movie,praveen sattaru movie,bheeshma director,venky kudumula  వరుణ్ తేజ్ వరస కమిట్మెంట్స్
Varun Tej Upcoming Movies Lineup వరుణ్ తేజ్ వరస కమిట్మెంట్స్
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామా లోనూ, ఎఫ్ 3 అనే కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. అటు గని, ఇటు ఎఫ్ 3 షూటింగ్స్ ని ఏకకాలంలో చుట్టేస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం సెకండ్ వేవ్ లాక్ డౌన్ అంటూ ఇంట్లోనే కూర్చోలేదు. గని కోసం కోసం జిమ్ లో ఇంకా కష్టపడుతున్నాడు. అయితే వరుణ్ గని, ఎఫ్ 3 తర్వాత స్పీడు పెంచాడు. వరుస కమిట్మెంట్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్ తేజ్ గరుడ వేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారుతో ఓ మూవీ కమిట్ అయ్యాడని, నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబో తర్వాత వరుణ్ - ప్రవీణ్ సత్తారు కాంబో పట్టాలెక్కుతోంది.

మరోపక్క భీష్మ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ అంటూ ఎప్పటి నుండో న్యూస్ నడుస్తుంది. భీష్మ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలనుకున్న వెంకీ కుడుములకి స్టార్ హీరోల డేట్స్ కష్టంగా మారడంతో వెంకీ వరుణ్ తో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. ఎఫ్ 3, గని తర్వాత ప్రవీణ్ సత్తారు - వెంకీ కుడుములు ప్రాజెక్ట్స్ ఏకకాలంలో చెయ్యాలనుకుంటున్నాడట. ఇక చిరు లూసిఫర్ లో వరుణ్ తేజ్ ఓ రోల్ చేయబోతున్నాడని చెప్పినా అది ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ త్రినాధరావు నక్కిన తో కమిట్ కాబోతున్నాడనే న్యూస్ మొదలైంది. రవితేజ తర్వాత త్రినాధరావు - వరుణ్ కాంబో మూవీ ఉంటుంది అని సమాచారం.

Varun Tej Upcoming Movies Lineup:

What is the next movie of Varun Tej?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ