Advertisementt

నిన్న రామ్ చరణ్.. నేడు మహేష్ బాబు

Wed 09th Jun 2021 01:22 PM
mahesh babu,ram charan,romancing,malayalee beauty,ram charan - mahesh babu,malavika mohan,malavika  నిన్న రామ్ చరణ్.. నేడు మహేష్ బాబు
Yesterday Ram Charan, Today Mahesh Babu నిన్న రామ్ చరణ్.. నేడు మహేష్ బాబు
Advertisement
Ads by CJ

మాస్టర్ హీరోయిన్ మాళవిక మోహన్ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మార్మోగిపోతోంది. ఎందుకంటే మాళవిక మోహన్ పేరు రామ్ చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో తాజాగా మహేష్ SSMB28 లో గట్టిగా వినిపించడమే. మాస్టర్ సినిమాలో నార్మల్ గానే కనిపించిన మాళవిక మోహన్ ని స్టార్ హీరోలు మాస్టర్ పీస్ గా చూస్తున్నారు. మాస్టర్ సినిమా రిలీజ్ కాకుండానే మాళవిక మోహన్ కి ఆఫర్స్ వెల్లువ కనిపించినా మాళవిక మోహన్ మాత్రం ఎలాంటి ఆఫర్స్ ఒప్పుకోకుండా ఉంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోల చూపు మాళవిక మోహన్ మీద పడింది అంటున్నారు.

రామ్ చరణ్ - శంకర్ కాంబో లో మాళవిక మోహన్ పేరు పరిశీలనలో ఉందట. అలా అయితే మాళవిక ఒకేసారి పాన్ ఇండియా లెవల్ కి వెళ్ళిపోతుంది. ఇక తాజాగా త్రివిక్రమ్ - మహేష్ కాంబో SSMB28 కి కూడా మాళవిక మోహన్ పేరు వినిపిస్తుంది. మహేష్ తో మాళవిక మోహన్ పెయిర్ బావుంటుంది అని త్రివిక్రమ్ కూడా ఆలోచిస్తున్నాడట. అసలైతే ముందు పూజ హెగ్డే నే మహేష్ కోసం హీరోయిన్ గా ఫైనల్ చెయ్యాలని త్రివిక్రమ్ అనుకున్నా.. మాళవిక అయితే మహేష్ పక్కన ఫ్రెష్ గా ఉంటుంది అనే ఆలోచనలో ఇప్పుడు గురూజీ ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.

Yesterday Ram Charan, Today Mahesh Babu :

Mahesh Babu romancing Malayalee beauty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ