ఈ రోజు ఉదయం నుండి కోవిడ్ వలన తెలంగాణాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్లుగా న్యూస్ ప్రచారంలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని, ఇప్పటికే CBSC, ICSE పరీక్షల రద్దు నేపథ్యంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలని కూడా రద్దు చేసే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది అని, కాదు కేసీఆర్ కేబినెట్ మీటింగ్ లో ఇంటర్ పరీక్షలని రద్దు చేసినట్లుగా, ఈ రోజు సాయంత్రానికి దానికి సంబందించిన ప్రకటన రాబోతున్నట్లుగా చెప్పారు.
అయితే తాజాగా తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసినప్పటికీ సెకండియర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం డోలాయమానంలో పడింది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దుపై ని జరుతున ప్రచారానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి స్పందించారు. ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయం ఇంకా తీసుకోలేదని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకంటామని, ప్రస్తుతమైతే ఎలాంటి ప్రకటన ఈ ఎగ్జామ్స్ రద్దు విషయంలో చెయ్యలేదని స్పష్టం చేసారు.