నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి బర్త్ డే విషెస్ చెప్పడానికి రాజకీయ, సినీ ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఫాన్స్ అయితే చెప్పక్కర్లేదు.. బాలయ్య బాబు పుట్టిన రోజు నాడు ఆయన కొత్త సినిమాల అనౌన్సమెంట్, పోస్టర్స్ తో పండగ చేసుకుంటున్నారు. ఇక బాలకృష్ణ కి ఆయన ఫ్యామిలీ నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అందులో ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి చెప్పిన విషెస్ తో పాటుగా యంగ్ ఎన్టీఆర్ చెప్పిన విషెస్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తండ్రిని పవర్ హౌస్ తో పోలుస్తూ Happy birthday to my powerhouse, my dad! #HappyBirthdayNBK అంటూ నారా బ్రాహ్మణి బాలయ్యకి బర్త్ డే విషెస్ పెట్టింది.
ఇక బాలయ్య తో కాస్త డిస్టెన్స్ మెయింటింగ్ చేసే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అకాల మరణంతో బాబాయ్ కి దగ్గరయ్యాడు. అప్పటినుండి తత్సంభందాలు మెయింటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ తన బాబాయ్ పుట్టిన రోజు కి స్వీట్ గా విష్ చేసాడు. జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK అంటూ బాలయ్య ఫోటో పెట్టి ఎన్టీఆర్ బాలకృష్ణ కి ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఎన్టీఆర్ బాలకృష్ణ కి విషెస్ తెలుపుతూ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.