Advertisementt

NBK107: బాలయ్య వేట మొదలు

Thu 10th Jun 2021 09:58 AM
balakrishna - gopichand malineni combo,balayya - gopichand - mythri movie makers combo,nbk107 announced,balakrishna birth day special,director gopichand malineni,nbk107 movie  NBK107: బాలయ్య వేట మొదలు
Balakrishna new project announced in style NBK107: బాలయ్య వేట మొదలు
Advertisement
Ads by CJ

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన ఫాన్స్ బాలయ్య కి విషెస్ చెప్పడానికి సోషల్ మీడియాలో పోటీ పడుతున్నారు. మాములుగా అయితే బాలయ్య ఫాన్స్ కేక్ కటింగ్స్, బాలయ్య బర్త్ డే బ్యానెర్లు కట్టడం, అలాగే ఆయన పుట్టిన రోజునాడు రక్తదానాలు చెయ్యడం చేసేవారు. కానీ కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో వేడుకలకి సమయం కాదని బాలయ్య ఫాన్స్ ని బుజ్జగించారు. దానితో ఫాన్స్ బాలయ్యకి సోషల్ మీడియాలోనే విష్ చేసేస్తున్నారు. ఇక ఆయన నటించిన అఖండ నుండి స్పెషల్ బర్త్ డే పోస్టర్ తో సరిపెట్టుకున్న ఫాన్స్ ఆయన కొత్త సినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేసారు.

ఇక బాలయ్య కొత్త సినిమా మైత్రి మూవీ మేకర్స్ లో గోపీచంద్ మలినేనితో కమిట్ అయ్యాడు. ఈ రోజు బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా మైత్రి వారు ఫాన్స్ కి స్పెషల్ గా ట్రీట్ ఇచ్చేసారు. NBK107 అప్ డేట్ అనుకున్న టైం కి దింపేశారు. బాలయ్య - గోపీచంద్ కాంబోలో పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో క‌థ సాగ‌బోతోంద‌ని.. బాల‌య్య వేట త్వ‌ర‌లోనే మొద‌లు కాబోతోంద‌ని.. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని ఎంపిక చేసినట్టుగా పోస్టర్ తో పాటుగా.. ఓ వీడియో ని వదిలింది టీం. మిగిలిన నటుల సంగతి, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. బాలకృష్ణ బర్త్ డే రోజున మైత్రి మూవీస్ వారి నుండి బాలయ్య స్టయిల్లో వచ్చిన ఈ ట్రీట్ కి బాలయ్య ఫాన్స్ ఫిదా అయ్యారు.

Balakrishna new project announced in style:

Balakrishna - Gopichand Malineni NBK107 announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ