Advertisementt

బాలీవుడ్ స్టార్ హీరో తో టాలీవుడ్ బబ్లీ గర్ల్

Thu 10th Jun 2021 10:41 AM
raashi khanna,raashi khanna photos,bollywood project,raashi khanna news  బాలీవుడ్ స్టార్ హీరో తో టాలీవుడ్ బబ్లీ గర్ల్
Raashi Khanna another bollywood project బాలీవుడ్ స్టార్ హీరో తో టాలీవుడ్ బబ్లీ గర్ల్
Advertisement
Ads by CJ

ఈమధ్యన పూజ హెగ్డే - రష్మిక మందన్న బాలీవుడ్ సినిమాల్లో నువ్వా - నేనా అని పోటీ పడుతున్నారు. వరస కమిట్మెంట్స్ తో నార్త్ లో ఈ భామలిద్దరూ జెండాలు పాతడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు మరో భామ కూడా బాలీవుడ్ లో బిజీ కాబోతుంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. పెద్దగా క్రేజ్ లోకి రాని రాశి ఖన్నా  మీడియం బడ్జెట్ హీరోలతో సర్దుకుపోతుంది. మొన్నామధ్యన అవకాశాలు తగ్గినట్లే కనిపించినా.. ప్రస్తుతం భామ జోరు మాములుగా లేదు. టాలీవుడ్, కోలీవుడ్ తాజాగా బాలీవుడ్ ఆఫర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒకప్పుడు బబ్లీగా ఉండే రాశి ఖన్నా ఈమధ్యన వర్కౌట్స్ తో ఫిట్ గా నాజూగ్గా తయారైంది. దానితో స్పెషల్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో అదరగొట్టేస్తుంది.

ఇక టాలీవుడ్ లో నాగ చైతన్యతో థాంక్యూ మూవీ షూటింగ్ ని ఫినిష్ చేసిన రాశి ఖన్నా మారుతీ - గోపీచంద్ పక్క కమర్షియల్ చిత్రంలో నటిస్తుంది. కోలీవుడ్ లో ఏకంగా మూడు నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యింది. కార్తితో ఓ సినిమా చేస్తున్న రాశి ఖన్నా.. ఆర్యాతో నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మరో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతితో తుగ్లక్‌ దర్బార్‌ ఫినిష్ చేసి విడుదల కోసం వెయిటింగ్ అంటుంది. అయితే పాప బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్ తో పని చేస్తుంది. అంతేకాదు.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకి సైన్ చేసానని చెబుతుంది. అంటే పాప మెల్లిగా బాలీవుడ్ లో అల్లుకుపోవడానికి రెడీ అయ్యిందన్నమాట.

Raashi Khanna another bollywood project:

Raashi Khanna gets crazy offer in Bollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ