బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు రద్దయినా ఆయన సినిమాల లుక్స్, కొత్త సినిమా అనౌన్సిమెంట్ తో హుషారుగా ఉన్న ఫాన్స్ లో ఇంకా డిస్పాయింట్మెంట్ ఏమిటి అనుకుంటున్నారా.. అదేనండి ఆయన కుమారుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ విషయంలో బాలయ్య ఫాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరగడమే కానీ.. బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయం తేలడం లేదు. ఎప్పుడో 2018 లోనే మోక్ష ఎంట్రీ విషయాన్ని మాట్లాడిన బాలయ్య ఇప్పుడు కొడుకు సినిమా విషయంపై నోరు మెదపడం లేదు.
మోక్షజ్ఞని తెరకి పరిచయం చేసే బాధ్యతను బాలయ్య ఆ దర్శకుడుకి అప్పజెప్పారని, కాదు ఈ దర్శకుడికి అప్పజెప్పారంటూ ప్రచారం జరిగినా.. బాలయ్య మాత్రం కొడుకు మోక్షజ్ఞ సినీరంగ ఎంట్రీ బాధ్యతను డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి అప్పగించారనే టాక్ కూడా నడిచింది. పూరి చేతుల మీదుగానే చిరు కొడుకు రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు. అలానే బాలయ్య కూడా కొడుకు మోక్షజ్ఞ బాధ్యతని పూరి చేతిలో ఆల్మోస్ట్ పెట్టారనే న్యూస్ నడిచింది. కానీ అది జరిగి మూడేళ్లయినా.. మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ విషయం వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ పుట్టిన రోజు అయినా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ ప్రకటన ఇస్తారేమో అని ఫాన్స్ ఎదురు చూసారు. కానీ నందమూరి కాంపౌండ్ నుండి ఎలాంటి చడీ చప్పుడు లేదు.