సుశాంత్ సింగ్ ప్రియురాలిగా హైలెట్ అయ్యి.. సుశాంత్ సింగ్ సూయిసైడ్ తో చిక్కుల్లో పడి.. చివరికి డ్రగ్స్ కేసులో జైలుకెళ్ళి.. మీడియా చేతిలో బొమ్మలా మారిన రియా చక్రవర్తి బెయిల్ పై బయటికొచ్చిన ఆరు నెలలు తర్వాత ఆమెకి బాలీవుడ్ ఆఫర్స్ ఒక్కొక్కటిగా క్యూ కడుతున్నాయి. జైలు నుండి బెయిల్ పై బయటికొచ్చిన రియా చక్రవర్తి ఈమధ్యనే ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 చోటు సంపాదించి ఔరా అనిపించింది. అంతేకాదు సోషల్ మీడియాలో మంచి యాక్టీవ్ గా మారింది. ఇక ప్రస్తుతం రియా చక్రవర్తి అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి చెహ్రే సినిమాలో నటించగా.. ఆ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. కరోనా కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.
తాజాగా రియా చక్రవర్తి కి ఓ భారీ బడ్జెట్ మూవీలో ద్రౌపది పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది అని.. పురాణ ఇతిహాసమైన మహాభారతం నుంచి ప్రేరణగా రూపొందనున్న ఈ సినిమాలో ద్రౌపది గా రియా చక్రవర్తి కీలక పాత్ర పోషించనుందట. అది కూడా మోడ్రెన్ ద్రౌపది గా రియా చక్రవర్తి కనిపించనున్నది అని సమాచారం. అయితే రియా చక్రవర్తి ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించనుంది అని.. ఇప్పటికే రియా తో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నారని, కానీ దీనిపై రియా చక్రవర్తి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది.