ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిలిం ఆదిపురుష్.. సినిమాపై భారీ అంచనాలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ముగిసి ఎప్పుడెప్పుడు షూటింగ్ చిత్రీకరణకు దిగిపోదామా అనే కసిలో టీం ఉంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు మిగతా షూటింగ్ ముంబై లో స్పెషల్ గా వేసిన ఆదిపురుష్ సెట్ లోను, అలాగే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఈ సినిమాలో సీత గా కృతి సనన్ నటిస్తుంది. మిగతా కీలక నటులు కూడా బాలీవుడ్ నుండే వస్తున్నారట. రావణ్ గా ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఇక ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా సచేత్ - పరంపర లకు మ్యూజిక్ బాధ్యతలను ఓం రౌత్ అప్పగించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారని చెబుతున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో నటించబోతున్నాడని టాక్ బిటౌన్ లో వినిపిస్తుంది. ఈమధ్యన బడా ప్రాజెక్ట్స్ నుండి బయటికి వస్తున కార్తీక్ ఆర్యన్ ఆదిపురుష్ లో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. అదే గనక నిజమయితే ఆదిపురుష్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.